ఉరకలేస్తున్న తాజా సర్వే–అభిమానులకి పూనకాలే….!!

రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించనున్నారు అని ఒక సర్వే తేల్చి చెప్పేసింది. ఇప్పుడుకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది. నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లుకె పరిమితం అయినా వైఎస్సార్సీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్రమంగా ప్రభ కోల్పోతోంది. ఆ పార్టీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుంది. 2014లో రెండు స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈసారి రిక్తహస్తమే. ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం,జనసేన కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి అని సర్వే తేల్చి చెప్పింది.