చంద్రబాబు ఫై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పైర్.2019 లో టీడీపీ కనుమరుగు అవుతుంది…!!!

రాజాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు సాయంత్రం తే.03.11.2018ది. పత్రికాసమవేశం.

2019 ఎన్నికలు టీడీపీకి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని, ఆ తర్వాత టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతుందని వైఎస్ఆర్ సీపీ రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు అన్నారు. రాహుల్‌ గాంధీతో కలిసిన పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు, విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాదని ఆయనకు ఎలాంటి నైతిక విలువలు, సిద్ధాంతాలు గానీ లేనే లేవని వైఎస్సార్‌సీపీ రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ – చంద్రబాబు కలయికపై ఎమ్మెల్యే గారు స్పందిస్తూ 1956 నవంబర్‌ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన రోజే రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన శక్తులతో చంద్రబాబు చేతులు కలిపి దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడు అవసరమైనప్పుడు బీజేపీని వాడుకున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వారు రాష్ట్రానికి ద్రోహం చేసినా కలిసి కాపురం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన కాంగ్రెస్‌నూ ఇప్పుడు వాడుకుంటారు. దేశం కోసం, మళ్లీ అవసరమనుకున్నపుడు బీజేపీతో జతకడతారేమో. ఆయనకు సిద్ధాంతాలు, ఎలాంటి విలువలు గానీ, విశ్వతనీయత గానీ ఉండవనేందుకు ఆయన వెనుక ఉన్న చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది అని రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు పేర్కొన్నారు.ఈ సమావేశం నకు రాజాం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

JMR AP STATE POLITICAL BUREAU.
YVASUNAIDU.