జగన్‌కు మూడంచెల భద్రత…

JMR విజయనగరం టౌన్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి మూడంచెల భద్రత కల్పిస్తామని జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జిల్లాలో ఇకపై నిర్వహించే ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడంచెల భద్రత కల్పిస్తామని వివరించారు.

పాదయాత్రలో జగన్‌ చుట్టూ వలయం ఏర్పాటు చేస్తామని, అందులోకి ముందుగా అనుమతి తీసుకున్న వారి నడవడికను పరిశీలించాకే పంపిస్తామని తెలిపారు. అనుమతి లేని వ్యక్తులను ఎవరినీ మూడంచెల భద్రతా వలయంలోకి పంపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

Y VASUNAIDU
JMR tv AP POLITICAL BUREAU.