ఫిరాయంపు నేతలకు అలజడి రేపుతున్న చంద్రబాబు నిర్ణయం…!!!

30కోట్లకి ఆశపడి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే లు తల పట్టుకుంటున్నారు. అనసరంగా పార్టీ మారాము అనుకుంటున్నారు. ఫిరాయంపు ఎమ్మెల్యే లకి ఓటమి భయం పట్టుకుంది. బాబు కాంగ్రెస్ తో పొత్తు తెలుగు దేశం పార్టీ లో జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు 2019లో అధికారం కోసం ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాడు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయమే ఫిరాయింపు నేతల గుండెల్లో రైళ్ళు పరుగెట్టిస్తోంది. కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఆల్రెడీ చంద్రబాబుతో తన ఆవేదన పంచుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్-టిడిపి పొత్తులో భాగంగా కర్నూల్ ఎంపి సీటుకు కాంగ్రెస్ తరపున కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

అలాగే ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు నేతల సీట్లను కాంగ్రెస్‌కి ఇవ్వనున్నాడు చంద్రబాబు. అసలే ఎమ్మెల్యే సీట్లు పెరగడం గ్యారెంటీ అని చెప్పి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించేలా చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ల పెరుగుదల లేదు అని తెలిసిపోయింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఉన్న సీట్లలో టిడిపి నేతలకు-ఫిరాయింపు నేతలకే సీటు కోసం యుద్ధం జరుగుతోంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్న సామెతను గుర్తుచేస్తోందని అభిప్రాయపడుతున్నారు.