రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ ఎంపీలు..!!!

రాష్ట్రపతి కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతికి వివరించనున్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరనున్నారు.ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. జగన్ బుజం ఫై ఉన్న గాయం ఇంకా తగ్గనిచో డాక్టర్స్ ఇంకో వరం పటు రెస్ట్ తీసుకోవాలి అని సూచించారు. జగన్ పాదయాత్ర 10వ తేదీ కి వాయిదా పడింది.

Y. Vasu Naidu
(JMR tv State Political Bureau.)