రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట!!!

పాట గురించి తెలిస్తే ఎవ్వరికైనా ఏఆర్.రెహమాన్ గురించి తెలియకుండా ఉండదు. ఆయన కంపోజింగ్ లో ఇష్టమైన పాట ఏదంటే ఒక్కటని చెప్పలేము. అయితే ఇన్నేళ్ళలో రెహమాన్ మరచిపోలేని ఎన్నో స్వరాలను అందించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొంది ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకున్నారు.

అయితే ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కొన్ని చేదు అనుభవాలు బాధకు గురి చేస్తాయి. ఆ ఘడియలను రెహమాన్ కూడా ఎదుర్కొన్నాడు. 25 ఏళ్ల వరకు రెహమాన్ కు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందట. యువకుడిగా ఉన్నపుడే తండ్రి మరణం ఇతర సంఘటనలు రెహమాన్ ని ఎంతో బాధకు గురి చేయడంతో కొన్ని సందర్భాల్లో చనిపోవాలని అనుకున్నారట.

“నోట్స్ ఆఫ్ ఎ డ్రీం: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఎ.ఆర్.రెహమాన్” లో ఈ విషయాన్నీ చెప్పాడు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు అంటే నిజంగా ఆశ్చర్యమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కృష్ణ తిలోక్ రచించిన ఈ బయోగ్రఫీ లో రెహమాన్ తన జీవితం గురించి అనేక విషయాలను బహిర్గతం చేశాడు. అదే విధంగా జీవితంలో ప్రతి ఒక్కరికి చావు వస్తుందని, సృష్టించబడిన ప్రతి దానికి ముగింపు ఉంటుంది గనుక అనవసరంగా  ప్రతి దానికి బయడటం ఎందుకని? తనకుతానుగా ప్రశ్నించుకున్నట్లు రెహమాన్ వివరణ ఇచ్చారు.

Y. Vasu Naidu
JMR tv AP State Political Bureau.