చంద్ర బాబు ఫై పోసాని ఫైర్..!!!

JMR అమరావతి: చంద్రబాబు ఫై సినీ నటుడు పోసాని గాటు అయినా వ్యాఖ్యలు చేసారు.చంద్రబాబు మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు.దేశ చరిత్రలోనే చంద్రబాబులాంటి మోసగాడు మరొకరు లేరని ఆయన విమర్శించారు.జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఈరోజు పోసాని నివాసానికి వెళ్లారు.తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నార‌న్నారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని అన్నారు.అవకాశవాద రాజకీయాల కోసం ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నాయకుడు దేశంలో చంద్రబాబు తప్ప మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని.టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తా అని పోసాని తెలిపారు.

JMR tv AP STATE POLITICAL BUREAU.
Y.VASUNAIDU.