జగన్ పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్న ఎపి డీజీపీ..!!!

JMR ప్రతినిది అమరావతి:
ఎపి ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.శనివారం నుంచి జరిగే జగన్ పాదయాత్రకు భద్రత పెంచుతున్నట్లు ప్రకటించారు.జగన్ కేసులో విచారణ కొనసాగుతోందని, స్టేట్‌మెంట్ ఇవ్వాలని జగన్‌ను రెండు సార్లు కోరామని, మరోసారి కోరుతామని చెప్పారు.జగన్‌ స్టేట్‌మెంట్ ఇస్తే విచారణ సులువవుతుందని డీజీపీ పేర్కొన్నారు. శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుపై విచారణ అధికారిదే నిర్ణయమని,ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుంచి ఎలాంటి నోటీస్ రాలేదని ఠాకూర్ తెలిపారు.జగన్ దాడి చేసిన శ్రీనివాసరావు తనకు ప్రాణాహాని ఉందని మీడియా ముందు వాపోయాడు. శ్రీనివాసరావు వ్యాఖ్యలతో మాలమహానాడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించింది.

మాలమహానాడు ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ స్పందించింది.ఏపీ డీజీపీ ఠాకూర్, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ లడ్డాకు ఎస్సీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.దాడి నిందితుడు శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో కమిషన్‌ వివరణ కోరింది.30రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు జరిపే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఆయన భుజం కండరాలకు అయిన గాయం పూర్తిగా మాననందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

JMR tv AP STATE POLITICAL BUREAU.
Y.VASUNAIDU.