బాబు ఫై విజయసాయిరెడ్డి ఫైర్…!!!

JMRTV AMARAVATHI:.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు.ట్విటర్‌ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు,టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలను ఆయన ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.తిత్లీ తుపాన్‌ బాధితులకు పరిహారం అందజేయడంలో పచ్చ చొక్కా నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తిత్లీ తుపాన్‌ విధ్వంసంతో కొబ్బరి,జీడి,వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే.బాధితులకు అందాల్సిన పరిహారాన్ని హైజాక్‌ చేసిన టీడీపీ నేతలు వారి నోట్లో మన్ను కొట్టారని విమర్శించారు.

సెంట్‌ భూమి లేనివారు సైతం బాధితులమంటూ.150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్టు రాయించుకున్న ఘటనలు కోకొల్లలని తెలిపారు.0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు చేసుకుని ఎకరానికి 60 కొబ్బరి చెట్లు చోప్పున 3 ఎకరాలకు 180 చెల్లు చూపించి 2.70 లక్షల పరిహారం పొందారని అన్నారు.ఈ విధమైన కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని దోచేశారని మండిపడ్డారు.

JMRTV AP STATE POLITICAL BUREAU.
Y.VASUNAIDU.