వైసీపీ లోకి టీడీపీ సీనియర్ నేత…!!!

JMRTV AMARAVATHI:
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీల మైత్రీ ఇరు పార్టీలలో పెద్ద రచ్చ లేపుతుంది.అంతేకాకుండా ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ పార్టీకి షాకిచ్చారు.అందులో భాగంగా సీనియర్ నేత మన్నవ సుబ్బారావు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,నక్కా ఆనందబాబు,వీవీవీ చౌదరి తదితరులు విచ్చేసి పాల్గొన్నారు.మన్నవకు పశ్చిమ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని సభలో ప్రతిపాదన చేయడం అక్కడున్నవారికి అశ్చర్యం కలిగించింది.

అయితే మన్నవకు బాబు టికెట్ కన్ఫామ్ చేశారని అందుకే ఈ సభకు మోదుగుల రాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎప్పటి నుండో టీడీపీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మోదుగుల టీడీపీ,కాంగ్రెస్ పొత్తును షాకుగా చూపించి పార్టీ మారతారని.అందుకే ఈ రోజు జరిగిన కార్యక్రమానికి హజరు కాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే మోదుగుల ఎప్పటి నుండో వైసీపీ పార్టీలో చేరతారు అని సమాచారం.

JMRTV AP STATE POLITICAL BUREAU.
Y.VASUNAIDU.