నేడు సాయంత్రం రాజాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పత్రికా సమావేశం శాసనసభ్యులు శ్రీ కంబాల జోగులు గారు సమక్షంలో జరిగింది.

JMR TV RAJAM:

నేటికి ప్ర‌జా సంక‌ల్పయాత్ర ఏడాది పూర్తి అయినది.వైఎస్‌ జగన్ గారు రాజకీయాల్లో అడుగేసిన క్షణం నుంచే తనదైన విలక్షణ శైలితో నడవడం మొదలుపెట్టారు.బహుశా,రక్తంలో ఇంకిన తండ్రి వారసత్వమేమో,రాజకీయ పదవుల కన్నా ప్రజల గుండెల్లో చోటే గొప్ప అన్న మనస్తత్వం నాటుకుపోయింది. ప్రజలంటే ప్రాణం. ప్రజాసమస్యలు తెలుసుకుని స్పందించడమే రాజకీయ వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది.దేశ రాజకీయాల్లో బలమైన ముద్రవేసే యువ ఎంపీగా అతను పార్లమెంటులోనే మొదట ప్రవేశించారు.దేశ రాజకీయాలను తేరిపారా చూస్తున్నంతలోనే జీవితంలో పెద్ద కుదుపు. వ్యక్తిగతంగా ఊహించని నష్టం. అవున్నిజం. తిరుగులేని రాజన్నగా ప్రజాస్వామ్యనేతగా వెలుగుతున్న తండ్రి మరలిరాని లోకాలకు తరలిపోయారు.

సరిగ్గా రాజకీయం నీడలప్పుడే కమ్ముకోవడం మొదలయింది. ఎన్నెన్ని పెద్దతలలు పూడ్చలేని శూన్యంతో అల్లాడిపోతున్న ఆ కుటుంబాన్ని మెల్లగా రాజకీయంగా కబళించే ప్రయత్నాలు మొదలెట్టాయి.ఆ క్రమంలో అప్పటిదాకా నిద్రపోయిన నాగులెన్నో పాకడం మొదలుపెట్టాయి.నాలుకలు బయటపెట్టాయి.జగన్‌ అవేవీ చూడలేదు.చూసినా పట్టించుకోలేదు.పట్టించుకునే వ్యక్తిత్వం కాదతనిది.ఒకటే ఆలోచన.ఒక్కటంటే ఒక్కటే ఆలోచన. అతన్ని నిలవనీయలేదు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక పగలిన గుండెలతన్ని కలవరపెట్టాయి.కలత పెట్టాయి ఆ కుటుంబాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలననే ఆలోచనలో పడేశాయి? ఏమిచ్చినా తక్కువేనన్న ఆలోచనతో ఆ సున్నిత మనసు తల్లడిల్లింది.నాన్నకోసం ప్రాణాలొదిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చాలని ఆ యువకుడు పెద్దమనసు ఆలోచించింది.ఆలోచించడమే తడవుగా ఆచరణ మొదలయింది.

వైఎస్‌ను కబళించిన పావురాల గుట్టనూ చూశాడు. చేరువలోని నల్లకాలువ చెంత తరలొచ్చిన జనం మధ్య నిలిచి మనమంతా వైఎస్‌ కుటుంబమన్నాడు.నాన్నగారు నాకింత కుటుంబాన్ని ఇచ్చాడని గుండెగొంతుకలొకటి చేసి చెప్పాడు. నాన్నకోసం తపించి తపించి,
గుండెబద్దలయిపోయిన ప్రతి కుటుంబం చెంతకు వస్తానన్నాడు. తన విషాదాన్ని మరిచాడు.తన దుఃఖాన్ని మరిచాడు. ధైర్యంగా ’ఓదార్పు’ను సంకల్పించాడు.

ఆ ఓదార్పు చూసిన వారెవరూ తక్కువ చేయలేరు. అప్పుడూ జగన్‌వెంట కదిలిన వేలులక్షల జనం.తమ బిడ్డగా ఆదరించారు.రాజకీయం తెలియని ఆ స్వచ్చతపై మరకలు చల్లడం మొదలయింది.ఢిల్లీ హస్తంలో చాడీల చిట్టీలు గుమ్మరించారు.ఓదార్పు ఆపమన్నారు ప్రలోభాలు పెట్టారు. పదవుల ఎరచూపారు ఇచ్చిన మాట తప్పని నైజం ఆ ధైర్యానిది. మాట తప్పనని ధైర్యంగా చెప్పాడు. సరిగ్గా అప్పుడే ఆ ధైర్యం మీదనే మొదటి హత్యాచారయత్నం జరిగింది.దాన్ని సమర్ధించుకునేందుకు వ్యక్తిత్వంపై హత్యాయత్నాలు లెక్కకు మించి జరిగాయి.రాజశేఖరుడు లేడు. ఇక రాజకీయంగా తాము ఆడింది ఆట పాడింది పాట అనుకున్న దుష్ట శ‌క్తుల కుట్రలకు,కుతంత్రాలకు అడ్డూ అదుపై లేకుండా పోయింది.ఆ రాజకీయ రాబంధులు జగన్‌ను వేధించడం, వెంటాడం ఆపలేదు.అయినా సరే, అతను వెరవలేదు. వెన్నుచూపలేదు.మాట తప్పలేదు. ఓదార్పును వీడలేదు.

నాటి నాయకులు సంకుచిత మనస్తత్వాలకు నిదర్శనం.అమ్మా అ కుటుంబాలను ఓదార్చడం ఆ తండ్రి బిడ్డగా నా బాధ్యత అని చెప్పుకున్నా వినని దురుసుతనం. తల్లీబిడ్డలు వెళ్లి అడిగినా అంగీకరించని కఠినత్వం. జగన్‌ వ్యక్తిత్వంపై ఎన్నెన్ని మరకలు చల్లారు.ఎంతెంతగా బురద చల్లారు. చివరకు కత్తిపోటుకు మించిన గాయాలే చేశారు. ప్రజల్ని నమ్మించాలని విశ్వప్రయత్నాలే చేశారు. కుటిల రాజకీయాలకు తలొగ్గని ధైర్యం ముందుకే సాగింది. జనం నమ్మారతన్ని. ఆ వ్యక్తిత్వం బలమైందని విశ్వసించారు. అందుకే మరి ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా పటాపంచలవుతూనే వున్నాయి. అతని ధైర్యాన్ని దెబ్బకొట్టాలంటే.అది మరింత బలోపేతమయింది. వ్యక్తిత్వాన్ని హత్యచేసేయాలనుకుంటే అది మరింత, మరింతగా ఎవరెస్ట్‌ శిఖరమంతగా ఎదిగిపోయింది. మరో అసురాస్త్రం విసిరారు.ఆర్థికమూలాలపైనే హత్యాచార యత్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుని, జగన్‌ను నిర్వీర్యున్ని చేయాలనుకున్నారు.రాజీ పడలేదతను. తలవంచలేదు. చీకటి రాజకీయాలు నడపలేదు. కుటిల రాజకీయాలు కటకటాలవెనక్కు పంపినా అతను చెక్కు చెదరలేదు. అవసరార్థ రాజకీయాలను నడపాలనుకోలేదు.

ప్రజలకోసం జెండా ఎత్తాడు. వైఎస్సార్‌ ఎజెండాగా ఎత్తిపట్టాడు.తండ్రికోసం అసువులు బాసిన కుటుంబాలను ఓదార్చి తీరుతానని ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడతను. మాట తప్పకూడదన్న సిద్దాంతం నుంచే వైఎస్సార్‌సీపీ పార్టీ పుట్టింది.కుళ్లిపోయిన రాజకీయవ్యవస్థను మార్చేయాలని సంకల్పమే బలంగా ఎదిగింది. జనం పార్టీగా తిరుగులేని శక్తిగా రూపుదాల్చింది.ప్రజలకిచ్చిన వందలాది హామీలను గాలికొదిలేసిన నేతలూ జగన్‌ను విమర్శించే సాహసం చేస్తున్నారంటే దాన్ని బరితెగింపు అనుకోవాలా? సిగ్గుమాలిన నైజమనుకోవాలా?

ప్రజలంటే పట్టింపులేని నిరంకుశత్వమే సాగుతోంది.హామీల పేరిట ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకున్న తర్వాత దోచుకోవడం,దాచుకోవడం,వివక్ష రాజకీయాలు నడపడమే పరమావధిగా సాగుతున్న పచ్చపాలనలో మళ్లీ చీకట్లు అలుముకోవడం మొదలయింది.2004 కు ముందురోజులు గుర్తుకుతెస్తున్నాయి.ప్రజలకోసం బాధ్యతాయుత నాయకుడిగా జగన్‌ ప్రజాసంకల్పయాత్ర మొదలుపెట్టారు. సమస్యలు ఎత్తిచూపుతుంటే, ప్రజల భరోసానిస్తూ, ధైర్యం నూరిపోస్తుంటే. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతుంటే వేలులక్షలుగా జనం జగన్‌ను ఆదరిస్తున్నారు. నమ్ముతున్నారు.మళ్లీ డేగకళ్లు పడ్డాయి.వేట ఆపని రాజకీయడేగలు అవకాశం కోసం వెదుకులాడాయి.ఏకంగా జగన్‌పై భౌతిక హత్యాచారానికే పాల్పడ్డాయి.అయినా, జగన్‌ సానుభూతి కోసం డ్రామాలాడలేదు.అయినా సరే, పచ్చనేతలు విషంచిమ్మే ప్రయత్నాలు మానలేదు.నిజంగా ఇది సిగ్గుచేటైన విషయం కాక మరేమిటి? హత్యాయత్నంపై సరైన దర్యాప్తు అంటే జడిసిపోతున్న వారినెలా చూడాలి?

మొత్తానికి రేపటి కురుక్షేత్ర సంగ్రామంలో నిలిచి గెలిచేదీ జగనే అతనేనని గుబులు పట్టుకున్న రాజకీయ డేగలు వెంటాడే ప్రయత్నాలూ మానవు.అయినా,డేగరెక్కలు అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా సాధ్యం కాదో జగన్‌ వ్యక్తిత్వం కాంతిని అడ్డుకోవడమూ సాధ్యం కాని విషయమే. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లోని ముఖ్య ఘ‌ట్టాలు ఇలా.

జిల్లాల వారిగా పాదయాత్ర వివరాలు
#వైయస్‌ఆర్‌ జిల్లాలో 7 రోజుల పాటు
5 నియోజకవర్గాల్లో 93.8 కిలోమీటర్ల పాదయాత్ర
#కర్నూలు జిల్లాలో 18 రోజుల పాటు
7 నియోజకవర్గాల్లో 263 కిలోమీటర్లు
#అనంతపురం జిల్లాలో 20 రోజుల పాటు
9 నియోజకవర్గాల్లో 279.4 కిలోమీటర్లు
#చిత్తూరు జిల్లాలో 23 రోజుల పాటు
10 నియోజకవర్గాల్లో 291.4 కిలోమీటర్లు
#నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు
9 నియోజకవర్గాల్లో 266.5 కిలోమీటర్లు
#ప్రకాశం జిల్లాలో 21 రోజుల పాటు
9 నియోజకవర్గాల్లో 278.1 కిలోమీటర్లు
#గుంటూరు జిల్లాలో 26 రోజుల పాటు
12 నియోజకవర్గాల్లో 281 కిలోమీటర్లు
#కృష్ణా జిల్లాలో 24 రోజుల పాటు
12 నియోజకవర్గాల్లో 239 కిలోమీటర్లు
#పశ్చిమ గోదావరి జిల్లాలో 27 రోజుల పాటు 13 నియోజకవర్గాల్లో 316.9 కిలోమీటర్లు
#తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో 412 కిలోమీటర్లు
#విశాఖ జిల్లాలో 32 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో 277.1 కిలోమీటర్లు
#విజయనగరం జిల్లాలో ఇప్పటికి 26 రోజులు 7నియోజకవరగాల్లో 213.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు.

ఈ సమావేశంలో రాజాం నియోజక వర్గ శాసనసభ్యులు కంబాల జోగులు గారితో పరిధిలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాల్ నాయుడు గారు, వంగర మండలం కన్వీనర్ కరణం సుదర్శన్ రావు గారు, మరియు మండల పరిధి నాయకులు పాలవలస రాజగోపాల్ నాయుడు గారు,గేదెల దాలినాయుడు గారు,శాసపు వేణుగోపాల రావు గారు మరియు నాయకులు అభిమాన కార్యకర్తలు పాత్రికేయ మిత్రులు మరియు సూచనలు సోషల్ మీడియా ప్రతినిధులతో కార్యక్రమం దిగ్విజయంగా సాగింది.