ఎపి ప్రభుత్వం ఆముదం చెట్టు కు ఇచ్చే నష్టపరిహారం 242.91/-!!!!

ఇది ఆముదం చెట్టుకి ఇచ్చే పరిహారామా???
ఈ చెక్కు తయారు చేయడానికి ఇంతకంటే ఎక్కువ మీకు ఖర్చు అయ్యుండెదేమో?ఎపి ప్రభుత్వ వింత పనితీరులో ఇదో కొత్త రకమైన వింత.మెలియపుట్టి మండలం లో చొంపాపురం గ్రామంలో తిరుమరెడ్డి లక్ష్మీ నారాయణ గారికి10 టేకు చెట్లు,5 కొబ్బరి చెట్లు,15 మామిడి చెట్లు,18 జీడీ చెట్లు ఉన్నాయి..మొన్న వచ్చిన తుపాన్ నష్టం వలన మొత్తం అన్ని చెట్లు నేలకొరిగాయి.ఆయన కూడా అందరిలాగే ఆఫీస్ లా చుట్టూ ఓ పది సార్లు తిరిగి నష్ట పరిహారంరాపించుకున్నారు.ఆయనకు వచ్చిన చెక్కు చూసి నోరు వెళ్ళబెట్టుకోవలసి వచ్చింది ఎందుకంటే ఆయనకు వచ్చిన సొమ్ము 242.91 రూపాయలు నష్ట పరిహారం కోసం తిరిగి తిరిగి 2000 రూపాయలు వరకు ఖర్చు పెట్టారు, కానీ వచ్చింది రెండు వందల చిల్లర,తిరిగి 1700 చిల్లర ఇతనికి బొక్క.ఇది.. మన ప్రభుత్వ పనితీరు.ఉద్దానంలో అడ్డగా లక్షలు తింటున్నారు, పక్క మండలంలో మాత్రం వేలలో కూడా రావడం లేదు.ఇది అక్కడి అధికారులు పనీతిరో, లేక ఇక్కడ పలాస నియోజకవర్గ అధికార పార్టీ లీలలో అర్థం కావడం లేదు.చూద్దాం ఇంకా ఇలాంటి ఎన్ని వింతలు బయటాపడతాయో?