నన్ను దెబ్బకొట్టలేరు..? పవన్ కళ్యాణ్

JMRTV ANDHRA PRADESH:
జగన్‌పై దాడి గురించి మాట్లాడుతూ‘మొన్న జగన్‌ను ఎవరో చురకత్తితో పొడిచారంటగా!రాజకీయం ఎంత మారిపోయిందో చూడండి.!కోడి కాలికి కట్టే కత్తి భుజం మీద దిగితే, పాపం జగన్‌ పడ్డ బాధ వర్ణణాతీతం!చాలా బాధ కలిగించింది. దీనిపై ఒకరు సీబీఐ విచారణ అంటారు. మరొకరు సీఐడీ విచారణ అంటారు. అసలు దోషులెవరనేది శ్రీపాద వల్లభుడికే తెలియాలి.ఎవరో జగన్‌ చేతిపై గుచ్చితే దానికి పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలా? జనసేన పార్టీపై దుమ్మేస్తారా? ఏ ఒక్కరూ నన్ను ఇంచెత్‌ దెబ్బకొట్టలేరు.
నేను దేశసేవకోసం,సమాజ సేవ కోసం వచ్చాను’ అని వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు సంధించారు.‘పిఠాపురంనుంచి పోటీ చేయాలని నన్ను చాలామంది కోరుతున్నారు. శ్రీపాద శ్రీవల్లభుడి ఆశీస్సులు ఉంటే ఇక్కడ నుంచే పోటీ చేస్తానేమో చూద్దాం!’అని చెప్పారు.కాకినాడ:‘నేను అధికారంలోకి వస్తే కాకినాడ సెజ్‌ రైతులపై ఉన్న అక్రమ కేసులన్నీ ఎత్తివేసి, న్యాయం చేసాను’ అని పవన్‌ హామీ ఇచ్చారు.