వైసీపీ లోకి సి. రామచంద్రయ్య 13 న జగన్ సమక్షం లో చేరిక!!!

JMR TV AMARAVATHI:

వైసీపీలోకి మాజీమంత్రి సి.రామచంద్రయ్య.మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత సి.రామచంద్రయ్య వైసీపీలో చేరనున్నారు. అయన 13న విజనగరం లో జగన్ సమక్షం లో పార్టీ కండువా కప్పుకోనున్నారు,ఇటీవల టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం జీర్ణించుకోక పార్టీ నుంచి వెళుతున్నట్టు అయన తెలిపారూ,మరొక మాజీ మంత్రి బాపిరాజు కూడా పార్టీ వీడుతున్నట్లు సమాచారం.కాంగ్రెస్ నుంచి మరికొదరు నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఏ ప్రతిపాదనతో వైసీపీలో చేరుతున్నారు?ఏదైనా హామీ లభించిందా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు రామచంద్రయ్య వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనను సి.రామచంద్రయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు పై మంది పడ్డారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఎమ్మెల్సీగా గెలుపొంది దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వటం పై ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చర్చనీయాంశం గ మారింది.అంతే కాకుండా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని టీడీపీ నిర్ణయం చాలామంది వ్యతిరేకించటం చర్చనీయాంశం.ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.