సొంత గూటికి రేవంత్..కాంగ్రెస్ కి బిగ్ షాక్..??

JMRTV HYDERABAD:-

తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారా.??ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రేవంత్ కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు వదిలేయనున్నారా..?? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని గద్దె దించడానికి కూటమి కట్టి మరీ యుద్దానికి దిగుతుంటే ఇప్పుడు రేవంత్ ఒక్క సారిగా ఇలా యూటర్న్ తీసుకోవడానికి అసలు కారణం ఏమిటి..?? అసలు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతోంది..?? అనే వివరాలలోకి వెళ్తే…

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరి తెలియదు..కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు అయితే మరి కొన్ని సందర్భాను సారంగా తీసుకునే నిర్ణయాలుకూడా ఉంటాయి ఏది ఏమైనా సరే ఎన్నికల సమయంలో మాత్రం ఈ షాకులు ఆయ పార్టీలకి దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా ఉంటాయి.రాజకీయ భవిష్యత్తు కోసమే లేక ఉన్న పార్టీలో ఉన్నతమైన స్థానం కోసమో తెలియదు కానీ ఎన్నికల సమయంలో సరిగ్గా సమయం చూసి కీలక నేతలు చేసే టార్గెట్ రాజకేయాలు ఆయా పార్టీలకి వెన్నులో వణుకు తెప్పిస్తాయి..అయితే ఇప్పుడు ఇదే తరహ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటోంది ఆ పార్టీ కీలక వలస నేత అయిన రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ కి దిమ్మతిరిగే హెచ్చరిక చేశాడు.
ఎందుకంటే…?? టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే ఈ పరిణామాలతో ఆయనకి కాంగ్రెస్ లో భారీగానే పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది.ఆయన కూడా అదే ఆశించారు కాస్త ఆలస్యంగానైనా ఆయనకి వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి దక్కింది.ఐతే ఆయన ముందునుంచీ కోరుతున్నట్లుగా ఆయన వర్గానికి దాదాపు 20 సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటోందట కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నుంచీ మన ఒప్పందం ప్రకారమే 20 సీట్లు కావాలనే చెప్పానని ఇప్పుడు అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసిందని.అందుకు తగ్గట్లుగానే కొంతకాలం క్రితం ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనూ తన వర్గానికి 20సీట్ల కేటాయింపుపై రేవంత్ పట్టుపట్టినట్టు తెలుస్తోంది.అయితే రేవంత్ ఆశించినన్ని సీట్లు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడంతో రేవంత్ తీవ్ర అసంతృప్తితోఉన్నారని అయితే ఇప్పటి వరకూ కూడా ఈ విషయంపై కాంగ్రెస్ తనని సంప్రదించక పోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారని, కాంగ్రెస్ కి మరికొంత సమయం ఇచ్చి చూస్తానని ఒక వేళ తన కోరిక మేరకు కాంగ్రెస్ నడుచుకోక పొతే తప్పకుండా పార్టీని వీడటం ఖాయం అవుతుందని అదే జరిగితే రేవంత్ సొంత గూటికి చేరుతారనే టాక్ వినిపిస్తోంది.మరి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.