ఆసీస్‌-టీమిండియా పూర్తి షెడ్యూల్‌ ఇదే !!!!!

JMRTV న్యూఢిల్లీ: ఇటీవల స్వదేశంలో ముగిసిన ద్వైపాక్షిక సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టును చిత్తుచేసిన భారత క్రికెట్‌ జట్టు.. ఇప్పుడు విదేశీ గడ్డపై మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లిఆ చూస్తున్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి.. అదే ఊపును ఆస్ట్రేలియా గడ్డపై కొనసాగించి జట్టును విజయపథంలో నడిపించేందుకు సమాయత్తమయ్యాడు.

ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్ పర్యటనను టీమిండియా మూడు టీ20ల సిరీస్‌తో ప్రారంభనుంది. తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్, జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు, టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో పాల్గొనే జట్టును ప‍్రకటించాల్సి ఉంది.

టీ20 షెడ్యూల్‌

తొలి టీ20: నవంబర్ 21 – గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రెండో టీ20: నవంబర్ 23 – ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
మూడో టీ20: నవంబర్ 25 – ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

ఆసీస్‌తో మూడు టీ20లకు టీమిండియా

విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌

తొలి టెస్ట్: డిసెంబర్ 6 నుంచి 10 వరకు – అడిలైడ్ (ఉదయం 6 గంటల నుంచి)
రెండో టెస్ట్: డిసెంబర్ 14 నుంచి 18 వరకు – పెర్త్ (ఉదయం 8 గంటల నుంచి)
మూడో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు – మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటల నుంచి)
నాలుగో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు – సిడ్నీ (ఉదయం 5 గంటల నుంచి)

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులకు టీమిండియా

విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

తొలి వన్డే: జనవరి 12 – సిడ్నీ (ఉదయం 8.50 గంటలకు)
రెండో వన్డే: జనవరి 15 – అడిలైడ్ (ఉదయం 9.20 గంటలకు)
మూడో వన్డే: జనవరి 18 – మెల్‌బోర్న్ (ఉదయం 8.50 గంటలకు)