ఏం ఇన్నాళ్ల‌కు కానీ జ‌గ‌న్ ఏం రెడ్డో.. గుర్తుకు రాలేదా.. ప‌వ‌న్‌?

JMRTV VIJAYAWADA:
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జం. కానీ, సంచ‌ల‌నాలు సృష్టించి..నిరంతరం మీడియాలోనే ఉండాల‌నుకోవ‌డం దారుణం.గ‌తంలో అనేక మంది సంచ‌ల‌నాలు సృష్టించి… మీడియాలో నిలిచినా సాధించింది ఏమీలేదు.ప్ర‌జ‌ల‌తో చీవా ట్లు త‌ప్ప‌.తాజాగా ప్ర‌శ్నిస్తానంటూ..ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌న‌సేన పార్టీని పెట్టుకుని ప్ర‌శ్నిస్తున్నారు.అయితే, ఈ ప్ర‌శ్న‌లు చాలా ఎబ్బెట్టుగాను, త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు కాను ఉప‌యోగ‌ప‌డుతున్నాయే త‌ప్ప ప్ర‌యో జ‌నం లేకుండా పోతోంద‌ని జ‌న‌సేన నాయ‌కులే అంటున్నారు. రాజ‌కీయాల్లో ఎంత వ‌ర‌కు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎంత వ‌ర‌కు ప్ర‌శ్నించాలో..అంతే ప్ర‌శ్నించాలి.మ‌నం ఒక ప్ర‌శ్న వేస్తే.. ప‌బ్లిక్‌లో ఉన్నారుక‌నుక ప్ర‌జ‌లు త‌లోప్ర‌శ్న వేస్తా రు. ఈ విష‌యం తెలిసి కూడా ప‌వ‌న్ నోరు జారిపోయాడు.

తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా డు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను “ఏం రెడ్డి“ అని ప్ర‌శ్నించ‌డం ద్వారా ఆయ‌న వార్త‌ల్లో నిల‌వాల‌ని అనుకున్నారా? లేక‌.. ఇలా తిడితేనేకానీ, రాజ‌కీయాలు చేయ‌లేమ‌ని అనుకున్నాడో తెలియ‌దు కానీ ప‌వ‌న్‌.. తాజాగా మాత్రం జ‌గ‌న్‌పై విరుచుకు ప‌డి.. ప్ర‌జ‌లు త‌న‌పై విరుచుకుప‌డేలా చేసుకున్నాడు. జగన్‌ మోహన్‌రెడ్డి ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా, తరిమెల నాగిరెడ్డా, రావి నారాయణరెడ్డా, పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా. వాళ్లంతా జైలుకెళ్లారు. జగన్‌ కూడా జైలు కెళ్లారు. అంతామాత్రాన వారికీ, జగన్‌కూ పోలిక లేదు- అన్నాడు ప‌వ‌న్. వాస్త‌వ‌మే కావొచ్చు. అలాగ‌ని ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త‌, ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయ్యే అర్హ‌త‌.. లేద‌ని ఎవ‌రూ చెప్ప‌లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ పూర్తిగా విస్మ‌రించాడు.

నిజానికి అధికారంలోకి రావాల‌ని అనుకున్న నాయ‌కులు ఎవ‌రైనా.. అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసుకుంటారు. కానీ, ప‌వ‌న్ మాత్రం విప‌క్షాన్ని టార్గెట్ చేస్తున్నాడంటే.. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు అధికార ప‌క్షం క‌న్నా ఎక్కువ బ‌లం ఉంద‌నే అర్ధం వ‌స్తోంది. ఒక నాయ‌కుడితో మ‌రో నాయ‌కుడిని పోల్చుకోవాలని ప‌వ‌న్ అనుకున్న‌ప్పుడు.. ప్ర‌స్తుతం ఎంపీగానే ఉన్న త‌న అన్న ఏమేర‌కు ప‌వ‌న్ చెబుతున్న నాయ‌కుల మాదిరిగా వ్య‌వ‌హ‌రించాడో కూడా చెప్పుకొని ఎదుటివారిపై రాళ్లు వేస్తే బాగుంటుంది. ఇదే.. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌రామిరెడ్డి.. రాజ్య‌స‌భ‌స‌భ్యుడిగా ఉన్నప్పుడు ఏపీ స‌హా వివిధ రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌పై స‌భ‌ను హోరెత్తించారు. మ‌రి ఇదే ప‌వ‌న్ అన్న చిరు.. ఇప్పుడు ఎంపీగానే ఉన్నారు. మ‌రి పుచ్చ‌ప‌ల్లితో పోల్చుకోవాలి.. అనే నాయ‌కులు ముందు మీరు సంస్కార యుతంగా మారాల్సిన అవ‌స‌రం ఉంది.

ప‌వ‌న్ విష‌యానికే వ‌ద్దా.. ఏ ఆదర్శ నాయ‌కుల పేర్లు ఆయ‌న పేర్కొన్నారో.. వారిలో ఒక్క‌రినైనా ప‌వ‌న్ అనుస‌రిస్తున్నా డా? “ఒక స‌మ‌స్య‌ను తెర‌మీదికి తెచ్చిన‌ప్పుడు దానిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు విశ్ర‌మించ‌ను“- అన్న పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య‌.. నిజంగా ప‌వ‌న్‌కు ఆద‌ర్శ‌మైతే.. రాష్ట్రంలో ఎంతో మంది బాధితులు త‌మ స‌మ‌స్య‌లు ప‌వ‌న్‌కు చెప్పుకొన్నారు. వాటిపై పోరాటం చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. నేటికీ వాటి ఊసు ఎత్త‌క పోవ‌డం నిజంగా ఇప్పుడు చెబుతున్న నీతులు విని సుంద‌ర‌య్య ఆత్మ‌ఘోషించ‌డం ఖాయం. సుంద‌ర‌య్య ఏనాడూ.. ప్ర‌జ‌ల కోసం వెళ్లి.,. .. ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో పాగా వేయ‌లేదు. ఎక్క‌డా ఎవ‌రిపైనా నీచాతి నీచంగా మాట్లాడ‌లేదు. “ఎవ‌రిపైనైనా అవినీతి చేశావు“ అని అంటే..సుంద‌ర‌య్య స‌సాక్ష్యాల‌తో స‌హా నిరూపించారు. మ‌రి ఈ సాటి.. ప‌టిమ మీకెక్క‌డిది ప‌వ‌న్‌?! ఒక్క సారి ఆలోచించుకోండి!!ఇప్పుడున్న రాజ‌కీయ‌నాయ‌కులు ఆఖ‌రుకు మీతో కూడా.. వ్య‌క్తిగ‌త జీవితాలను రాజ‌కీయాల్లోకి లాగ‌కూడ‌దు_ అంటూ నీతులు చెబుతారు. కానీ, సుంద‌ర‌య్య‌కు వ్య‌క్తిగ‌త జీవిత‌మే లేదు.. అంతా ప్ర‌జా జీవిత‌మే.. ఆయ‌న‌లా మీరు న‌డిచిన‌ప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత మీకుంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించాలి.. ప‌వ‌న్‌!!