కేసీఆర్‌ ఆస్తులు.. అప్పులు !!!!

JMR TV గజ్వేల్‌(సిద్దిపేట జిల్లా):ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు,అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు.

Home ప్రజాసంకల్పయాత్రఎలక్షన్ స్పెషల్వీడియోలుసినిమాక్రీడలు బిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్Search
కేసీఆర్‌ ఆస్తులు.. అప్పులు
15 Nov, 2018 07:46 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌(సిద్దిపేట జిల్లా): ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్‌ మొత్తం ఆస్తుల విలువ- రూ.22,60,77,936

చరాస్తులు- రూ.10,40,77,946
స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్‌ వగైరా..)
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.5,63,73,946
తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000
తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000
కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)

మొత్తం అప్పులు- రూ.8,88,47,570

ఇందులో కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570
కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు
తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు ఉన్నట్లు కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో చూపించారు.
కేసీఆర్‌ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులున్నాయి. ఇందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర ఆభరణాల విలువే అధికం. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184.