కోదాడ బరిలో హాస్య నటుడు వేణుమాధవ్‌ !!!

JMRTV కోదాడ అర్బన్‌: సినీ హాస్య నటుడు వేణుమాధవ్‌ కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. కాగా వేణుమాధవ్‌ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భాం తర్వాత ఆయన పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేట్టారు.

తదనంతరం ఆయనకు సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను స్వయంగా వేయనున్నట్లు తెలిపారు.