అందరి చూపూ ఆ పార్వతీపురం బహిరంగ సభవైపే…

JMRTV ప్రతినిధి, విజయనగరం: ఆయన వస్తున్నారంటేనే ఓ సంచలనం.అడుగేస్తున్నారంటే ప్రభంజనం.ఆయన ప్రసంగిస్తున్నారంటే పాలకపక్షనేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ప్రతి మాటలో నిజాయితీ ప్రతి నిర్ణయంలో ఎంతో నిబద్ధత ఇదీ జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై జనానికి ఉన్న నమ్మకం.హత్యాయత్నం నుంచి బయటపడి మృత్యుంజయుడై వచ్చిన ఆయన ప్రజాసంకల్ప యాత్రలో నాలుగు రోజులుగా పాల్గొంటున్నా ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య లూ చేయలేదు. ఇక మిగిలింది పార్వతీపురంలో బహిరంగ సభ. అక్కడ ఏం మాట్లాడతారో ఏం ప్రకటన చేయబోతున్నారో ఆయన నిర్ణయం ఏమై ఉంటుందోనన్న ఆత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

అడుగడుగునా కుట్రలే…
జిల్లాలో సెప్టెంబర్‌ 24వ తేదీనుంచి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దిగ్వి జయంగా సాగుతోంది.జిల్లాలో ఆయన అడుగుపెట్టినప్పటినుంచీ ప్రత్యర్థుల కుట్రలు ఊపిరి పోసుకుంటున్నాయి.తొలిరోజే కొత్తవలసకు తరలివచ్చిన అశేషజనవాహిని చూసి పాలకపక్ష నాయకుల్లో కలవరం మొదలైంది.ఎలాగైనా ఈ యాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూశారు.పలు చోట్ల కుట్రలతోకూడిన ఫ్లెక్సీలు వేశారు.వాటిని జనం పట్టించుకోలేదు. పలుచోట్ల సభలు జరుగుతుండగా కావాల నే కాస్త కలకలం సృష్టించేందుకు అంబులెన్సులను పంపిం చారు.క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు వాటికి చక్కగా దారి చ్చి జగనన్న సైనికులమని నిరూపించుకున్నారు.

తరువాత పలుచోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలకు ఎలా అనుమతులిచ్చారంటూ జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల సాక్షిగా అధికారులపై పాలకపక్ష నేతలు విరుచుకుపడ్డారు.ఇన్ని చేసినా ఆయన వేసిన ప్రతి అడుగు వెనుకా వేలాదిమంది కదులుతున్నారు. చివరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వేదికగా ఏకంగా హత్యకే యత్నించారు.దానినుంచి బయటపడి చికిత్సచేయించుకుని పూర్తిగా కోలు కోకపోయినా…కేవలం జనంలోనే ఉండాలన్న ఆకాంక్షతో జిల్లాలో నాలుగు రోజుల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నారు.ఇన్నాళ్లూ తనపై జరిగిన హత్యాయత్నంగురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఇప్పుడు బహిరంగ సభలో ఏం మాట్లాడుతారోనని అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా….
వైఎస్సార్‌పీనీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.శనివారం ఉదయం 7.30 గంటలకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం సూరంపేట రాత్రిబస నుంచి ప్రారంభమై పార్వతీపురం పాతబస్టాండ్‌ జంక్షన్‌ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు.అక్కడే బహిరంగ సభ జరుగుతుందన్నారు.సూరంపేట నుంచి బయలు దేరి నర్సిపురం, వసుంధరనగర్,యర్రా కృష్ణకాలనీవరకూ సాగుతుందని తెలిపారు.తిరిగి మధ్యాహ్న భోజనానంతరం పార్వతీపురం పాతబస్టాండ్‌ జంక్షన్‌ వరకు చేరుకుని అక్కడే బహిరంగ సభ జరుగుతుందన్నారు.అక్కడే బసచేస్తారని తెలిపారు.