బ్రమ్మ రథం పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు.శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర.?

శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర.

JMRTV శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది.305వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత పాదయాత్రగా శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల చేరుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వాసులు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు.జననేత రాకతో శ్రీకాకుళం జిల్లా సరిహద్దులు జనసంద్రంగా మారాయి. వీరఘట్టంలోని పార్వతీపురం రోడ్డు జనసందోహంతో కిక్కిరిసిపోయింది.

వైఎస్సార్‌ సీపీ నాయకులు పాలవలస రాజశేఖరం, కంబాల జోగులు,విస్వసరాయి కళావతి, పాలవలస వీక్రాంత్, బొత్స సత్యనారాయణ,మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), ధర్మాన ప్రసాద్‌రావు, కృష్ణదాసు,తమ్మినేనితో సహా పలువురు నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో రాజన్న తనయుడి పాదయాత్ర పూర్తైన విషయం తెలిసిందే.