ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసులు…!!!

JMRTV జైపూర్‌: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ సంస్థ ఒకటి లీగల్‌ నోటీసు ఇచ్చింది.మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.రాజస్తాన్‌లోని ఆల్వార్‌ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు.ఆయన నిరుపేద దళితుడు.రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు.ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు.ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి.రావణులకు కాదు’అని అన్నారు.దీంతో యోగికి రాజస్తాన్‌ సర్వ్‌ బ్రాహ్మిణ్‌ మహాసభ అధ్యక్షుడు సురేష్‌ మిశ్రా నోటీసులు పంపారు.