పరిటాల సునీత కు ఎదురు దెబ్బ?

JMRTV అనంతపురం : రాప్తాడు మండలంలో మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళి ఆధిపత్యం చెలాయించడమేమిటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయన వర్గీయులు ఆందోళన చేశారు.మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు..ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు.కాగా ఈ విషయమై పరిటాల వర్గంలో చర్చ మొదలైంది.