నీరుఅందిస్తామని, రైతాంగాన్ని మభ్యపెట్టడం తగదు. సర్వే పల్లి శాసన సభ్యులు కాకాని!!!!

తేది.05-12-2018
JMRTV నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో కనుపూరు చెరువును రైతులతో కలిసి పరిశీలించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 కనుపూరు కాలువ కింద 30 వేల ఎకరాలకి నీరందిస్తున్నామంటూ,రైతాంగాన్ని మభ్యపెట్టడం తగదు.

👉జిల్లాలో సమన్వయ లోపంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర కష్టాలు పడుతున్నారు.

👉పండించుకోవడానికి సాగునీరు లేక,పండించుకున్న పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న బాధలు వర్ణాతీతం.

👉సాగునీరు అందించలేక మోటార్లకు కరెంట్ కనెక్షన్ కట్ చేసి,చిన్న సన్నకారు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

👉ఆయకట్టు రైతాంగానికి సమృద్ధిగా నీరందిస్తూ,అవసరం బట్టి,కొద్దిపాటి అదనపు నీరిచ్చి మోటార్లు కింద పండించే చిన్న సన్న కారు రైతులను ఆదుకోవాలి.

👉డేగపూడి-బండేపల్లి కాలువ నిర్మాణం మాటలకే పరిమితం అయ్యింది తప్ప,కార్యరూపం దాల్చలేదు.

👉శ్రీశైలం జలాశయం నుండి సోమశిల జలాశయానికి నీరు తరలించి ఉంటే,రైతుల కష్టాలు తీరేవి.

👉గతంలో లక్షల ఎకరాలు పండించామని చాటింపు వేసుకున్న నాయకులు,ప్రస్తుతం రైతాంగానికి సాగునీరు అందించపోవడానికి కారణం తెలపాలి!.

👉 కాలువల మీద తిరిగి,రైతులకు అందుబాటులో ఉంటూ,సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు,నా సాయశక్తులా కృషి చేస్తా.

admin