ప్రభుత్వం తీరు పై కాకాని ఫైర్…!!!

JMRTV నెల్లూరు:
నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:-

👉 చంద్రబాబు పని తీరుపై మాజీ ప్రధాన కార్యదర్శి, అజయ్ కల్లాం గారు కీలక అంశాలకు సంబంధించి చేసిన ఆరోపణలపై చంద్రబాబు వివరణ ఇవ్వలేకపోతున్నాడు.

👉 చంద్రబాబు దగ్గర పనిచేసిన మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం గారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు,ఇసుక అక్రమ రవాణా లాంటి విషయాల్లో అవినీతికి పాల్పడి,చంద్రబాబు తోపాటు అధికార పార్టీ నాయకులు 3 లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రకటించిన మాట వాస్తవమే.

👉 చంద్రబాబు అవినీతిని, ఆయన ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు ప్రధాన కార్యదర్శులు అవినీతిని గురించి వాస్తవాలు వెల్లడించడం విస్మయానికి గురి చేస్తుంది.

👉భారత దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి మీద,ఒకరికి ఇద్దరు ఉన్నతాధికారులు ఆరోపణలు చేయడం ఇదే ప్రధమం.

👉స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారి దగ్గర పని చేసిన ఒక్క ఉద్యోగి అయినా ఆయనపై ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయా!

👉తన ప్రభుత్వ పని తీరుని విమర్శిస్తూ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విమర్శలు చేస్తే, ఒకటికి మూడు అంశాలపైన, సి.బి.ఐ. విచారణ కు ఆదేశించిన ఘనత స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది.

👉చంద్రబాబు తన అవినీతి బండారం బయట పడుతుందని, సి.బి.ఐ. జోక్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నివారిస్తూ, ఉత్తర్వులు ఇవ్వడం వెనుక అంతరార్ధం ప్రజలు గమనిస్తున్నారు.

👉అజయ్ కల్లాం గారి ఆరోపణలపై చంద్రబాబు వివరణ ఇవ్వలేక, సోమిరెడ్డి లాంటి కిరాయి మంత్రులను మొరగడానికి ఉసికొల్పుతున్నాడు.

👉 ప్రధాన కార్యదర్శలుగా పని చేసేటప్పుడు, నియమ నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన సోమిరెడ్డికి లేకపోవడం శోచనీయం.

👉 చంద్రబాబు పై వస్తున్న ఆరోపణలపై మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం వాళ్ల మధ్య ఉన్న అంతర్గత బంధానికి నిదర్శనం.

👉 చంద్రబాబు 2013వ సంవత్సరంలో చెప్పినట్లుగా, అవినీతి పరులందరూ చివరకు చేరేది కాంగ్రెస్ పార్టీలోనే అన్న మాటలు అక్షరసత్యాలు.

👉చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు.

👉రెడ్డిని తిట్టడానికి రెడ్డి అవసరమని, మంత్రి పదవి బిస్కట్ ని సోమిరెడ్డికి ఎరగా వేసి ఉసికొల్పుతున్నాడు.

👉 సోమిరెడ్డిని చూస్తే, తోలుబొమ్మలాటలో కేతిగాడు పాత్ర గుర్తుకొస్తుంది.

👉 సోమిరెడ్డి రైతురధం, మిల్లర్ల దగ్గర ముడుపులు, సిలికా అక్రమ రవాణా, ఇరిగేషన్ దొంగ బిల్లులు, పసుపు కుంభకోణం లాంటి అక్రమాలకు పాల్పడి జిల్లాలోనే 500 కోట్లు సంపాదించాడు.

👉 గత ఎన్నికల్లో చందాలు దండుకున్న సోమిరెడ్డి, రాబోవు ఎన్నికల్లో ఓటుకు 5 వేలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు.

👉 చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలకు, విచారణ జరిపించుకునే ధైర్యం ఉందా!

👉 చంద్రబాబుపై చేసిన ఆరోపణలను న్యాయస్థానం సమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టాలి.

admin