సుజనా చౌదరి అరెస్ట్ కాబోతున్నా డా..? బాబు మౌనం అందుకేనా!!!

JMRTV న్యూఢిల్లీ:-

సుజనా చౌదరి అరెస్ట్ కాబోతున్నాడా..? బాబు సైలెంట్ అందుకేనా..?

● కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ .. మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ అధికారులు నిర్వహించి ఆయన అనేక ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు కేసులు నమోదు చేసుకుని సమన్లు కూడా పంపారు. అయితే ఈ విషయం పై ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. కానీ ఈ వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు. దీంతో ఆయన వరసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సుజనాకు చెందిన కంపెనీలు అప్పుగా తీసుకున్నాయి. వ్యాపారంలో నష్టాలని ఆ సొమ్ములను ఎగవేశారు. ఆ కంపెనీలే డొల్ల కంపెనీలు అని లోన్ల కోసమే వాటిని పుట్టించినట్టుగా ఈడీ నిర్ధారించింది. అయితే సుజనా చౌదరి వ్యవహారంలో ముందు టీడీపీ.. ఆ పార్టీ అనుకూల మీడియా గట్టిగా స్పందించింది. అయితే ఈ వ్యవహారం రోజు రోజుకు బిగిసే ఛాన్స్ కనిపించడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చౌదరిని ఈడీ అరెస్టు చేయవచ్చని చంద్రబాబుకు కూడా తెలిసిందని.. అందుకే బాబు ఇప్పుడు కామ్ గా ఉన్నాడని, చౌదరి గురించి మాట్లాడితే ఆ వ్యవహారం తమకు చుట్టుకుంటుందని తెలుగుదేశం నేతలు కూడా మౌనం వహిస్తున్నారని పార్టీలోనే గుజగుసలు వినిపిస్తున్నాయి.

admin