నెల్లూరు జిల్లా, ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

JMRTV NELLORE:-
తేది.06-12-2018
నెల్లూరు జిల్లా, ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

👉 సాగునీరు పంపిణీ విషయంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు.

👉 సాగునీటి పంపిణీలో అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

👉 అధికారులు ఆయకట్టు వివరాలు,అందించకుండా,కాకి లెక్కలు చెప్పి,రైతులను మభ్యపెడుతున్నారు.

👉 సాగునీటి పంపిణీలో అధికారులు తప్ప,అధికార పార్టీ నాయకుల జోక్యం తగదు.

👉 మోటార్ల కింద పండించుకునే చిన్న,సన్నకారు రైతులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదు.

👉 చెరువులకు చేరిన నీటిని, ఆయకట్టు రైతులకు అందించకుండా,కొంతమంది మెట్ట పంటలకు వినియోగించు కుంటుంటే,ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

👉 ప్రాంతాల వారిగా విడిపోయి,సాగునీటి కోసం ప్రజా ప్రతినిధులు పోరాడవలసి రావడం దురదృష్టం.

👉 ఇరిగేషన్ అధికారులు,పారదర్శకంగా వ్యవహరించి, నిర్దేశించిన ఆయకట్టు సాఫీగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి.

👉రాజకీయాలక తీతంగా,రైతాంగ సమస్యలను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యతను బట్టి సాగునీరు రైతులను ఆందోళనకు గురి చేయకుండా అందించాలి.

👉 మత్స్యకారుల పేరిట,సైకిళ్లు,వలలు,ఆటోలు,అర్హులైన యస్.టి.లకు పంపిణీ చేయక పోవడం సరికాదు.

👉 అధికార పార్టీ నాయకులు,సభ్యుల పేరిట ఫోర్జరీ సంతకాలతో తప్పుడు తీర్మానం ద్వారా అర్హులకు అన్యాయం చేశారు.

👉 సైకిళ్ళు,వలలు,నెల్లూరులో అమ్మివేసి,ఆటోలు పరాదీనం చేశారు తప్ప, అసలైన యస్.టి.మత్స్యకారులకు అందలేదు.

👉 అనికేపల్లి పంచాయతీలో ఒక్క యస్.టి.కు కూడా మత్స్య శాఖ సైకిళ్లు,వలలు,ఆటోలు పంపిణీ చేయలేదంటే నిధులు,ఏ విధంగా దుర్వినియోగాన్ని అర్ధం చేసుకోవచ్చు.

👉 చేపలు పెట్టుకొనేందుకు లైసెన్స్ ల మంజూరు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి,అవినీతికి పాల్పడుతూ,అర్హులకు లైసెన్సులు మంజూరు చేయకుండా అడ్డు కుంటున్నారు.

👉 పత్రికలలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయంటే,అవినీతి స్థాయిని అర్ధం చేసుకోగలం.

👉 పంపిణీ చేసిన సైకిళ్లు,వలలు,ఆటోలపైన,తప్పుడు తీర్మానాలతో అధికారులను పక్కదారి పట్టించిన వ్యక్తులపై జిల్లా కలెక్టరు గారు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి.

admin