ఇండియాటుడే సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం….

: JMRTVLIVE

హైదరాబాద్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని మెజారిటీ ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. కారు దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో ఇతరులు నాలుగు నుంచి ఏడు స్థానాలు కైవసం చేసుకోనున్నారని తెలిపింది.

ఇక, టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేసింది.రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌-ప్రజాకూటమి మధ్య హోరాహోరీ ఉన్నట్టు పేర్కొంది. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 స్థానాలు, కాంగ్రెస్‌కు 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి నాలుగు నుంచి ఏడు స్థానాలు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది.

టీఆర్‌ఎస్‌కు 46శాతం ఓట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 46శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి 37శాతం ఓట్లు, బీజేపీకి ఏడుశాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. పాతబస్తీలో గట్టిపట్టు కలిగిన ఎంఐఎం మూడుశాతం ఓట్లు సాధిస్తుందని, ఇతరులు ఏడుశాతం ఓట్లు గెలుచుకుంటారని తెలిపింది.

సర్వే చేసిన సంస్థటీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌ (ఫ్రంట్‌) బీజేపీఇతరులు
టైమ్స్‌ నౌ66070709
ఇండియా టుడే79-9121-3301-0304-07
రిపబ్లిక్‌ టీవీ50-6538-524-710-17
న్యూస్‌ ఎక్స్‌57460610
ఇండియాటీవీ62-7033-4106-0806-08
admin