తెలంగాణ 67శాతం పోలింగ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌….

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు సుమారు 67శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. మొత్తం వివరాలు అందాక పోలింగ్‌ శాతం కొద్దిగా మారే అవకాశముందని ఆయన తెలిపారు.

సర్వే వివరాలను వెల్లడిస్తున్న లగడపాటి..

  • తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు 65 స్థానాలు వస్తాయని, అధికార టీఆర్‌ఎస్‌కు 35 స్థానాలు వస్తాయని, ఇందులో పది స్థానాలు ఎక్కువ, తక్కువ కావొచ్చునని ఆయన పేర్కొన్నారు. కూటమి మిత్రపక్షమైన టీడీపీకి ఐదు నుంచి ఏడు స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పారు. బీజేపీకి ఏడు స్థానాలు, స్వతంత్రులకు ఏడు స్థానాలు వస్తాయని, ఇందులో రెండు స్థానాలు అటు-ఇటు కావొచ్చునని తెలిపారు. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలు రావొచ్చునని చెప్పారు.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ 66, కాంగ్రెస్‌ 37, బీజేపీ 7, ఇతరులు 9

admin