నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం..

నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటాచలం, ముత్తుకూరు జెడ్.పి.టి.సి.లు మందల వేంకట శేషయ్య, నెల్లూరు శివ ప్రసాద్, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కోడూరు ప్రదీప్ రెడ్డి, టి.పి.గూడూరు మండల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరయ్య గౌడ్ మరియు వై.యస్.ఆర్.సి.పి. నాయకులు.

వెంకటాచలం జెడ్.పి.టి.సి. మందల వెంకట శేషయ్య స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 ఫోర్జరీ సంతకాలతో తప్పుడు తీర్మానాలు చేయించి, కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొడుతుంటే, చూస్తూ ఊరుకోవాలా!

👉 జిల్లా కలెక్టరు గారు విచారణ జరిపి, పొరపాట్లు జరిగాయని నిర్ధారించుకుని క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశిస్తే, మంత్రి రాద్దాంతం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి!

👉 బి.సి.ల మీద ప్రేమ నటిస్తున్న సోమిరెడ్డికి తనకు కమిషన్లు ఇచ్చే బి.సి.లపై ఉన్న ప్రేమ ఇతర పార్టీల బి.సి.లపై లేకపోవడం శోచనీయం.

👉 నేను గనుక అనుకుంటే, ప్రతిపక్ష నాయకులను ఏమైనా చేయగలను అని మేకపోతు గాంభీర్యాం మానుకోవాలి.

👉 ముత్తుకూరు మండలం, పైనాపురం పంచాయతీలో 2001 లో సర్పంచ్ గా పని చేసిన, బి.సి. మహిళపై 2017 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే నీవు ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయించిన మాట వాస్తవం కాదా! అప్పుడు ఆమె బి.సి.అన్న సంగతి మరచిపోయావా!

👉 రామదాసు కండ్రిగ గ్రామంలో బి.సి.లు వడ్డెరలకు సంబంధించిన 100 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళతో కలసి అప్పణంగా కాజేయడానికి ప్రయత్నిస్తే, కాకాణి అడ్డుకున్న విషయం నిజం కాదా!

👉 బహిరంగ సభల్లో వేదికలపై నీ ప్రక్కన అగ్రవర్ణాలకు చెందిన వారు ఆశీనులు కావాలి తప్ప, నీవు బి.సి.లకు స్థానం కల్పించే పరిస్థితి ఎప్పుడైనా ఉందా!

👉 బి.సి.లను వాడుకోవడం, వదలి వేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య.

👉 బి.సి.లని, యస్.సి.లని కాదు, తప్పు జరిగిందా లేదా! చర్యలు తీసుకోవాలా లేదా అని ఆలోచించాలి తప్ప, పొరపాటు చేసిన వాడిని కులాలు, మతాలు పేరిట వెనుకేసుకురావడం నీ మూర్ఖత్వం.

👉 జిల్లా కలెక్టరు గారు కూడా బి.సి. సామాజిక వర్గానికి చెందిన వారే,విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగాన్ని గుర్తించిన తరువాత చర్యలకు ఆదేశించారు తప్ప, నీలాగా కులాలు, మాతాలు అంటూ సర్దుబాటు ధోరణి ప్రదర్శించకపోవడం గొప్పతనం.

👉 సోమిరెడ్డి బాధంతా, పనులు ఆగిపోవడంతో, సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కమిషన్ల రూపంలో తీసుకున్న డబ్బు, వెనక్కి ఇవ్వవలసి వస్తుందేమోనన్న ఆందోళనతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.

👉 మంత్రి స్థాయిలో మాట్లాడే ముందు, నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప,లేని పక్షంలో ప్రజలలో పలుచన కావడం ఖాయం.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కోడూరు ప్రదీప్ రెడ్డి గారి స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 గతంలో సోమిరెడ్డి తో పని చేశాం, ప్రస్తుతం కాకాణితో పని చేస్తున్నాం. కాకాణి గారికి ఉన్న అవగాహనలో పదిశాతం కూడా సోమిరెడ్డికి లేదు.

👉 సర్పంచ్ గుమ్మడి రాజా యాదవ్ పైన గతంలో యస్.పి. మల్లారెడ్డి గారి దగ్గరకు వెళ్లి, రౌడీ షీట్ తెరవాలని లేకపోతే నిరసన చేపడతానని సోమిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసిన మాట వాస్తవం.

👉 సోమిరెడ్డి పోలీస్ అధికారులపై ఆనాడు వత్తిడి తెచ్చి, రాజా యాదవ్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించాడు.

👉 సోమిరెడ్డి ఆ రోజు రాజా యాదవ్ పై చేసిన ఆరోపణలు, ఈనాడు ప్రశంసల వెనుక అంతరార్ధమేమితో తెలియజేయాలి. ఆ రోజు రాజా యాదవ్ బి.సి. అన్న సంగతి గుర్తుకురాలేదా!

👉 సోమిరెడ్డి యస్.పి.దగ్గరకు తీసుకువెళ్లి రాజా యాదవ్ పైన చేసిన తీవ్రమైన ఆరోపణలకు మేమే సాక్ష్యం.

👉 సోమిరెడ్డి గతంలో రాజా యాదవ్ పై ఆరోపణలు చేయలేదని, కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేయగలడా!

👉 సోమిరెడ్డి ఆనాటి యస్.పి.ని మా సమక్షంలోనే, రాజా యాదవ్ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి తన వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కఠిన చర్యలు తీసుకోవాలని, ఒకింత బెదిరింపు ధోరణిలో,తరువాత బ్రతిమాలి,ఎట్టకేలకు ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేయించాడు.

👉 సోమిరెడ్డి రాజాయాదవ్ పై గతంలో పట్టుపట్టి ఎఫ్.ఐ.ఆర్. నంబరు 190/2009 నమోదు చేయించినప్పుడు, బి.సి. అని మరచిపోయాడా!.

👉 తనతో ఉన్నప్పుడు, ఒక ధోరణి, తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడూ ఒక ధోరణితో వ్యవహరించడం మంత్రి స్థాయిలో సోమిరెడ్డి కి తగదు.

admin