‘మరోమారు కారుదే కుర్చీ’

లగడపాటే కాదు.. ఎవరూ అంచనా వేయలేరు…

 JMRTV LIVE వరంగల్‌ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడందరూ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మాత్రం తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కడియం శ్రీహరి స్పందించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రానుందనే లగడపాటి అంచనాల్ని కొట్టిపడేశారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ పాలనపట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమయిందని తెలిపారు. సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కడియం ఆశాభావం వ్య​క్తం చేశారు. ప్రజల నాడీని ఏ సర్వేలు పసిగట్టలేవని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 11న ప్రజా మద్దతు ఎవరికుందో స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన లగడపాటి తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి తప్పుడు సర్వేలు చెప్తున్నారని మండిపడ్డారు.

admin