నెల్లూరు జిల్లా మీడియా సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డి….

తేది.08-12-2018
నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

👉కుటుంబాలను, తల్లితండ్రులను వదలి లక్షలమంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తరుణంలో, మొక్కుబడిగా డిఎస్సి విడుదల చేయడం అన్యాయం.

👉 చంద్రబాబు, మేనిఫెస్టోలో ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ క్రమం తప్పకుండా, ప్రతి ఏటా నిర్వహిస్తామని, పేర్కొన్న చంద్రబాబు, మేనిఫెస్టోనే వెబ్ సైట్ నుండి తొలిగించివేశాడు.

👉2015 మార్చిలో క్యాలెండర్ విడుదల చేసినా, 42 నోటిఫికేషన్లు ఇవ్వవలసి ఉన్నా, అది ఆచరణకు నోచుకోకుండా, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.

👉డిఎస్సైకి సంబంధించి, మంత్రి 22,184 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సుప్రీంకోర్టులో 19వేల ఖాళీలు ఉన్నాయని, చివరకు 12,370 పోస్టులని, కేవలం 7 వేల పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయడం క్షమించరాని నేరం.

👉నిరుద్యోగులు దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 115మందిలో ఒక్కడికి ఉద్యోగ అవకాశం కల్పించడం చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనం.

👉టెట్ పరీక్షలు 2 సార్లు నిర్వహణ పేరుతో నిరుద్యోగుల నుండి ఫీజులు రూపంలో దాదాపు 150 కోట్లు వ్యాపారం చేసుకుని, చివరకు టెట్ పరీక్షలకు విలువ లేకుండా చేశారు.

👉 బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వంలో తన కుమారుడు లోకేష్ కు రెండు ఉద్యోగాలు వచ్చాయి తప్ప,నిరుద్యోగులకు జాబులు రాలేదు.

👉 పంచాయతీ సెక్రటరీల నియామకం పేరుతో పచ్చ చొక్కాల వారికి పందేరం చేయడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో జి.ఓ.39ని విడుదల చేసి, అన్ని వర్గాల నుండి తీవ్ర నిరసనలు వెల్లువవడంతో గత్యంతరం లేక రద్దు చేయడం జరిగింది.

👉స్వర్గీయ వై.యస్.ఆర్. మెగా డిఎస్సి పేరిట 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు హామీ పత్రాలు ఇచ్చి, విడతల వారీగా ఉద్యోగాలు కల్పించిన మహనీయుడు.

👉డిఎస్సి ఉద్యోగులు నిరసన తెలియచేస్తే, బెదిరింపులు, కేసులు,అరెస్టులు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవమానిస్తున్నారు తప్ప, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదు.

👉చంద్రబాబు ఇంటికొక్క ఉద్యోగమని, 2 వేలు రూపాయలు నిరుద్యోగ భృతి అని, కేవలం కొంతమందికి మాత్రం వేయి రూపాయలు ఇస్తూ, నిరుద్యోగ యువతకు మోసం చేస్తూ, సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

👉ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా, ప్రభుత్వ రంగ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేట్ స్కూళ్లకు వంత పడుతున్నాడు.

👉 చంద్రబాబు ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి, నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు, క్యాలెండరు విడుదల చేసిన ప్రకారం 42 నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

👉జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అన్నీ భర్తీ చేయడంతో పాటు,ప్రతి ఏటా క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.

admin