తూర్పు గోదావరి లో వైసీపీ పాగా ,కీలక నేతలు….

తూర్పు గోదావరి  రాజకీయాలు రోజు రోజుకి వేడి పుట్టిస్తున్నాయి, టీడీపీ కి పెద్ద షాక్ తగలటం కాయం గ కనిపిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయాలి అని జగన్ పక్క ప్లాన్ గీశారు. టీడీపీ నుంచి అతిపెద్ద నాయకులూ వైసీపీ లో ఈ నెలాఖరున చేరే అవకాశం వుంది. రామచంద్రపురం నుంచి తోట తిమూత్రులు, పెద్దాపురం నుంచి బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, వైసీపీలో చేరడానికి అధినేత తో చర్చలు చేసినట్టు సమాచారం, వైసీపీ లోకి రావడానికి జగన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని చెబుతున్నారు. చలమసెట్టి సునీల్ కూడా వైసీపీలోనే ఉంటారని దానికి బొడ్డు మంత్రం పనిచేసిందని సమాచారం. బొడ్డు భాస్కర రామారావు తీసుకునే నిర్ణయం సునీల్ పై ఉంటదని, అయితే జగన్ సునీల్ ను ఎంపీ గ ఉండాలి అని చేసిన చర్చలు సఫలం అయ్యాయి. మొదట బొడ్డు భాస్కర రామారావు ను మండపేట వెళ్ళమని జగన్ కోరగా అయన పెద్దాపురం పై పట్టు బిగించారు. పెద్దాపురం టికెట్ ఇస్తే గెలిచి మీచేతిలో పెడతానని జగన్ కి హామీ ఇచ్చారు బొడ్డు, జగన్ తోట నరసింహం కు కూడా జగ్గంపేట టికెట్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది.

జిల్లాలో మూడు టీం లుగా వున్నా ప్రశాంత్ కిశోరె టీం రోజు రోజుకి ప్రజల నాడి తెలుసుకుంటున్నారు. పెద్దాపురం, జగ్గంపేట, పై జగన్ కు నివేదిక ఇవ్వగా జగన్ పైన మార్పులకు శ్రీకారం చుట్టారు. పెద్దాపురం లో బొడ్డు కి ఇవ్వటం తో అయన అనపర్తి డాక్టర్ గారిని గెలిపించి తీరుతా అని జగన్ కి చెప్పారు అంట ఆయనను మార్చవద్దు అంటూ మారిస్తే ఇబ్బందులు పడాలని చెప్పారు అని సమాచారం, అటు ప్రత్తిపాడు పై కూడా జగన్ తీసుకునే నిర్ణయాన్ని విరవించుకోవాలని అయన కోరారు. తోట తిమూత్రులు రాకను బోసు కూడా ఒప్పుకోవటం తో రామచంద్రాపురంలో వైసీపీ బలపడింది. తోట తిమూత్రులు జగన్ ఊహించని హామీ ఇవ్వడంతో అయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ముద్రగడ్డను ఏ విధంగా ఈ నాయకులూ వైసీపీ నడిపిస్తారో చూడాల్సిన పరిణామం.

admin