నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ నీ వీడి వైసీపీ కి భారీ వలసలు!???

తేది.09-12-2018
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో, తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్య నేతలతో కలిసి సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన100 కుటుంబాలు.

మనుబోలు మండలంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు టి.డి.పి.మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి మరియు మనుబోలు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సూరపనేని కిషోర్ నాయుడు,టిడిపి వాణిజ్య విభాగ అధ్యక్షుడు గిద్ధంటి రమణయ్య మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి, డిపాజిట్లు గల్లంతవడం ఖాయం.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఇంచార్జీగా మంత్రి వ్యవహరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వస్తున్నారు.

👉మంత్రి కుటుంబ సభ్యులతో సహా నియోజకవర్గంలోనే నిత్యం పర్యటిస్తూ, ప్రజలను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, నియోజకవర్గంలో వలసలు నివారించలేకపోతున్నారు.

👉నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించగలిగాం కాబట్టే, ప్రజలు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

👉వర్షాలు కురిస్తే, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాధగా ఉందని వ్యాఖ్యానించడం చూస్తే, తెలుగుదేశం పార్టీ ఇంచార్జీకి మతి భ్రమించినట్లుగానే భావించాలి.

👉డేగపూడి-బండేపల్లి కాలువ ద్వారా సాగునీరు అందించి, 2019 ఎన్నికల్లో ఓటు అడుగుతామని చెప్పిన వాళ్ళు, రాబోవు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగగలరు!.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతిని అడ్డుకుంటూ, అభివృద్ధికి సహకరిస్తున్నాం.

admin