కాంగ్రెస్‌ హేమాహేమీలు ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో…లైవ్‌ అప్‌డేట్స్‌ : కాంగ్రెస్‌ డీలా!

JMRTVLIVE UPDATE HYDERABAD:

ఉదయం 10 : కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది.కాంగ్రెస్‌ హేమాహేమీలు ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ,గీతారెడ్డి,షబ్బీర్‌ అలీ,జీవన్‌ రెడ్డిలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు.మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది.ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది.ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 89,కాంగ్రెస్‌ 15, ఎమ్‌ఐఎమ్‌ 2,బీజేపీ 4,ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.మొదటి రన్‌ ఎమ్‌ఐఎమ్‌ కొట్టేసింది. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఓవైసీ గెలుపొందారు.

ఉదయం 9:30 : కాంగ్రెస్‌కు అన్నిచోట్లా ఎదురుదెబ్బ తగులుతోంది.ఇప్పటికే కాంగ్రెస్‌ ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు.హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా వెనుకబడ్డారు.ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 85,కాంగ్రెస్‌ 14, ఎమ్‌ఐఎమ్‌,బీజేపీ నాలుగు స్థానాల్లో,ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ,రేవంత్‌ రెడ్డి,జానారెడ్డి,భట్టి విక్రమార్క లాంటి నేతలు వెనుకబడ్డారు.టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.కూకట్‌పల్లి,బెల్లంపల్లి,చెన్నూర్‌,వైరా, శేరిలింగంపల్లి,నకిరేకల్‌,వనపర్తిలో టీఆర్‌ఎస్‌..పరిగి, సూర్యాపేట్‌,తుంగతుర్తి,హుజుర్‌నగర్‌,భూపాలపల్లిలో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
ఉదయం 9 : కొండగల్‌లో రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు.రెండో రౌండ్‌లో కూడా డికె అరుణ,పొన్నాల లక్ష్మయ్య,జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు.కారును వెంటాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ కూడా హైస్పీడ్‌లో దూసుకుపోతుంది.ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 75,కాంగ్రెస్‌ 22, బీజేపీ 3,ఎమ్ఐఎమ్‌ ఒక్కస్థానంలో ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.హరీష్‌ రావు,ఈటెల రాజేందర్‌,దానం నాగేందర్‌,సూర్యాపేటలో దామోదర్‌ రెడ్డి దూసుకుపోతున్నారు.పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు.ఇబ్రహీంపట్నంలో మల్‌ రెడ్డి రంగారెడ్డి ,పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి దూసుకుపోతున్నారు.

ఉదయం 8:30 : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు కారు వేగంగా దూసుకుపోతోంది.వేగం పెంచేసి 21స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.అలాగే కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇకముందు ఎవరు ఆధిక్యంలో ఉండనున్నారు..ఎవరు గెలవనున్నారో తెలుస్తుంది.నల్గొండ జిల్లాలో 9218 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి.మక్తల్‌, సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్‌ పశ్చిమలో మొదటి రౌండ్‌ పూర్తయ్యేసరికి 3022 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది.

ఉదయం 8 : తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఏ పార్టీ ఆధిక్యంలో ఉండనుందో,ఏ పార్టీ గెలవనుందో వీటన్నంటికి చెక్‌పడనుంది.మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు.అరగం‍టపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో​ స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఉదయం 7:30 : తెలంగాణలో ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది.నేడు ఎవరు పీఠాన్ని అదిష్టంచనున్నారో తెలియనుంది.ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మొదలవ్వనుండగా..అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికివారే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎవరి ధీమా నిజం కానుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లను పూర్తి చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా,అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

admin