నెల్లూరు జిల్లా, సర్వే పల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న వలసలు పరంపర.!!!

తేది.11-12-2018
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా కొనసాగుతున్న వలసలు.

నెల్లూరు జిల్లా,తోటపల్లి గూడూరు మండలం,మండపం గ్రామ పంచాయతీ పరిధిలో, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో, తెలుగుదేశం పార్టీ నుండి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు.

తెలుగుదేశం పార్టీ నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు సభ్యులు ఉప్పాల వెంకయ్య, కుప్పా సురేష్, బొచ్చు పుల్లయ్య, తాండ్ర మోహన్, బొచ్చు సురేష్, తాండ్ర లక్ష్మి కాంతమ్మ.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉 సర్వేపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది.

👉 తెలుగుదేశం ప్రభుత్వ పదవీ కాలం పూర్తి అయిందంటే, తెలుగుదేశం పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏజెంట్లు కూడా దొరకరు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో, అన్ని మండలాలు, ఒక దానిని మించి ఒకటి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కన బరుస్తున్నాయి.

👉తెలంగాణా ఎన్నిక ఫలితాలు, చంద్రబాబుకు చెంప పెట్టులాంటిది.

👉ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు విజయం దేవుడెరుగు, రాబోవు ఎన్నికల్లో కనీస స్థానాలు సాధించుకోలేడు.

👉2019 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి, పట్టిన చంద్ర గ్రహణం వీడనుంది.

👉యన్.టి.రామారావు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, యన్.టి.ఆర్. కుటుంబ సభ్యులను తన స్వార్ధం కోసం పావులుగా వాడుకుంటూ, ఆ కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు.

👉 చంద్రబాబు మాయమాటలు నమ్మి, హరికృష్ణ కుమార్తె, కూకట్ పల్లి ఎన్నికల్లో పోటీ చేసి, మోసపోయింది.

👉 చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు మాత్రం, యం. యల్.సి.తో పాటు మంత్రి పదవి ఇచ్చి, యన్.టి.ఆర్. కుటుంబ సభ్యులకు మాత్రం ఓటమి పాలయ్యే స్థానాలలో పోటీకి నిలబెట్టి, పధకం ప్రకారం యన్.టి.ఆర్. కుటుంబ పరువును దిగజారుస్తున్నాడు.

👉 చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టి, 500 కోట్ల రూపాయలు డబ్బులు సమకూర్చి, ఉధృతంగా ప్రచారం చేసినా తెలంగాణాలో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు.

👉 చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందువల్ల, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.

👉తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోవడానికి, చంద్రబాబు లాంటి అవకాశవాదితో కలిసి పోటీ చేయడమే.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ జరగని, ఊహకందని స్థాయిలో, అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ పెత్తనం సాగిస్తున్నవారు, ఎంతటివారైనా, అవినీతిని అడ్డుకుంటాం తప్ప, విడిచిపెట్టేదిలేదు.

👉రాబోవు 2019 ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పక్షాన భారీ మెజారిటీ సాధించే నియోజకవర్గాల్లో, సర్వేపల్లికి చోటు దక్కుతుంది.

👉పార్టీలో చేరిన వారందరికీ, చేర్పించడానికి కృషి చేసిన వారందరికీ, పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.

admin