మధ్యప్రదేశ్‌లో బీజేపీ – కాంగ్రెస్‌ హోరాహోరి..!

JMRTVLIVE భోపాల్‌ : ఐదు రాష్ట్రాల ఎన్నికల తుది సమరం నేటితో ముగియనుంది. అధికారాన్ని చేజిక్కించుకునేదేవరో.. ప్రతిపక్షంలో నిలిచేదేవరో మరి కొన్ని గంటల్లో తెలనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కౌటింగ్‌ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ – బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాష్ట్రంలోని 50 కీలక స్థానాలు పార్టీల భవితవ్యాన్ని డిసైడ్‌ చేస్తాయి. మంగళవారం ఉదయం 8. 06 నిమిషాలకు కౌంటింగ్‌ ప్రారంభమయ్యింది. గెలుపు కోసం రాహుల్‌ గాంధీ తన నివాసంలో పూజలు నిర్వహించారు. దాదాపు 35 స్థానాల్లో బీజేపీ – కాంగ్రెస్‌ మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ కొనసాగుతుంది. బుధ్ని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ లీడ్‌లో కొనసాగుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్‌ 28న పోలింగ్‌ జరుగగా, 2 వేలకు పైగా మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్‌ 229 స్థానాల్లో బరిలో నిలిచింది. ఒక సీటును శరద్‌యాదవ్‌ నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌కు వదిలేసింది. బీఎస్పీ 227 స్థానాల్లో, ఎస్పీ 51 స్థానాల్లో, ఆప్‌ 208 స్థానాల్లో పోటీపడ్డాయి. 1,094 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 75.05 శాతం పోలింగ్‌ నమోదయింది.

admin