మిజోరం హస్త‘గత’మా?ఎంఎన్‌ఎఫ్ లీడ్‌?

JMRTVLIVE మిజోరాం:- 40 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం.దాదాపు 8 జిల్లాల్లోని 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా రెండు స్థానాలనుంచి బరిలో ఉన్నారు.తొలి అంచనాల ప్రకారం ఎంఎన్ఎఫ్ 8 స్థానాల ఆధిక్యంతో దూసుకు పోతుండగా, కాంగ్రెస్‌ కేవలం 3 స్థానాల్లో లీడ్‌లో ఉంది. తాజా సమాచారంలో ఎంఎన్ఎఫ్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 11 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

గత 2013 ఎన్నికల్లో 34 సీట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకోగా,ఎంఎన్ఎఫ్ 5 స్థాలను గెల్చుకుంది.అయితే ఎగ్జిట్ పోల్ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) కాంగ్రెసును ఓడించనుందని అంచనా వేయడం గమనార్హం.దీంతో సీఎం హాట్రిక్‌ కొడతారా లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

కాగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన సెర్చిప్‌తో పాటు చంపై దక్షిణ నియోజకవర్గంలో  పోటీ పడుతున్నారు మరి  ఈ సారి కూడా ఆయన పై చేయి స్థాధిస్తారా? లేక ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో  వెనక్కి తగ్గక తప్పదా?  నవంబరు 28న ఓటర్లు ఈవీఎంలలో నిక్షిఫ్తం చేసిన ఆయన భవితవ్యం మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

admin