రేవంత్‌, కోమటి రెడ్డి వెనుకంజ..!

JMRTVLIVE హైదరాబాద్‌ : ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్‌ కీలక నేతలు మొదటి రౌండ్‌ ముగిసేలోపు పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు.వీరిలో నాగార్జున సాగర్‌లో జానారెడ్డి,గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క,ఆందోల్‌లో దామోదర రాజనరసింహ,కోదాడలో ఉత్తమ్‌ పద్మావతి,జహీరాబాద్‌లో గీతారెడ్డిలు వెనుకంజలో ఉన్నారు.ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొసాగుతోంది.అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం మూడో రౌండ్‌లోనూ జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నాయి.

admin