నెల్లూరు జిల్లా, పొదలకూరు మండల గ్రీవెన్స్ లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి…!!!

తేది.17-12-2018
నెల్లూరు జిల్లా, పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్స్ లో పాల్గొని, ప్రజల సమస్యలు పరిష్కరించ వలసినదిగా అధికారులను కోరిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:-

👉 గ్రీవెన్స్ డేలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నా, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోతున్నాయి.

👉చంద్రబాబు మాటల్లో మాత్రం అభివృద్ధిని జపిస్తూ, చేతల్లో మాత్రం అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నాడు.

👉పొదలకూరు మండల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇతరుల భూములను, ప్రభుత్వ భూములను, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

👉రైతులకు సాగునీరు అందించకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.

👉అవినీతి సంపాదన కోసం రైతులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు తప్ప, గతంలో ఎన్నడూ చూడలేదు.

👉 మంత్రుల వ్యక్తిగత సహాయకులు రాపూరు మండలం, పంగిలిలో అటవీ భూములు ఆక్రమించి, దొంగ పట్టాలు పుట్టించారు.

👉మంత్రుల వ్యక్తిగత సహాయకులు, 3కోట్ల రూపాయల గ్రామ కంఠాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు.

👉పంగిలీ అటవీ భూముల విషయంలో కానీ,పొదలకూరు గ్రామ కంఠం భూమి విషయంలో గానీ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి.

👉భూముల గోల్ మాల్ పై విచారణ జరిపించే ధైర్యం ఉందా!.

👉భూముల అక్రమాలపై ప్రశ్నించినా, అభివృద్ధిని అడ్డుకుంటున్నామని ప్రచారం చేస్తారేమో!.

👉మంత్రుల పాత్ర ఉండబట్టే విచారణ జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

👉పంచాయతీ కార్యదర్శి, తన సంతకం ఫోర్జరీ చేశారంటూ, లిఖితపూర్వక ఫిర్యాదు అందచేసినా, పోలీసులు కేసు నమోదు చేయడానికి మీనమేషాలు లెక్కించారు.

👉పోలీసులు కేసు నమోదు చేయకుండా అడ్డుకోవడంలో మంత్రి పాత్ర లేదా!

👉70 సంవత్సరాలు పొదలకూరును పరిపాలించిన వారు ఏమిచేశారని ప్రశ్నిస్తున్నారు.

👉చేతనైనంత అభివృద్ధి చేశాం తప్ప, ఇతరుల పొలాలను అమ్మే సాహసం ఎన్నడూ చేయలేదు, చేయబోము.

👉ఇటువంటి వ్యక్తులు అధికారంలో కొనసాగితే, పొదలకూరు ప్రాంత వాసులు, మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

👉అధికార మత్తులో, అవినీతికి పాల్పడుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కలుషితం చేస్తున్నారు.

👉పొదలకూరు ప్రాంత ప్రజలతో మా కుటుంబానికి విడదీయరాని సంబంధాలు ఉన్నాయి.

👉పొదలకూరు మండలంలో గ్రామాలకు దార్లు తెలియని వ్యక్తులు చేసే ప్రకటనలు పట్టించుకోము.

admin