“వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు…!!!

హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు.’పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆయన ఆయురారోగ్యాలతో,సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్విట్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడుగారు అంటూ వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.వైఎస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్‌ చేశారు.

ఈ ఏడాది మీకు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైందిగా ఉండబోతోందని ఖచ్చితంగా చెప్పగలనని జనతాదళ్ (యునైటెడ్) ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

admin