నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో విలేకరులతో కాకాని గోవర్ధన్ రెడ్డి!!!

తేది.27-12-2018
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ ప్రకటించి, వెంటనే నిధులు విడుదల చేసిన ఘనత స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుంది.

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ గ్రామ సభలు నిర్వహించిన తరువాత పదివేల కుటుంబాలు గుర్తించడంతో మరిన్ని నిధులు అవసరపడ్డాయి.

👉 వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మరణంతో, అదనపు నిధులు విడుదల చేయకపోవడంతో, ప్యాకేజీ పంపిణీ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కోసం, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడంతో కదలిక వచ్చింది.

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ పంపిణీ చేపట్టడం సంతోషకరం,కానీ విడతల వారీగా కాకుండా,ప్యాకేజీ మొత్తాన్ని ఒకే సారి పంపిణీ చేపట్టాలి.

👉 నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ విడతలవారీగా పంపిణీ చేస్తామని ప్రకటించడం సరికాదు.

👉ఎన్నికల వేళ హామీలన్నీ గుర్తుకు రావడం మంచిదే కానీ, సమస్యలను పరిష్కరించండి తప్ప, మోసగించడం సరికాదు.

👉వాయిదా పద్దతులలో రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీ విషయాలలో మోసగించినట్లే, నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ విషయంలో కూడా మోసగించవద్దు.

👉చివరి ఎన్నికలు అంటూ ప్రకటించుకుంటున్నవారు, ప్రజలను చివరిసారిగా మోసం చేయడానికి ఆలోచిస్తున్నారు.

👉ప్రభుత్వం ఏర్పడి 54 నెలలు కావస్తున్నా, మంత్రిగా 20 నెలలు పని చేస్తున్నా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నారు.

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ పంపిణీ స్వాగతిస్తాం, ఒకేసారి మొత్తాన్ని పంపిణీ చేయాలన్నదే మా డిమాండ్.

👉ఎన్నికల సమయంలో చేపట్టే కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా, ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఉండాలి.

👉నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ పూర్తిగా పంపిణీ చేయని పక్షంలో, వై.యస్.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తాం.

👉జగన్ ముఖ్యమంత్రి కాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో పాటు, నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ, సాల్టు భూముల సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తాం.

👉ఆక్వా రైతులకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు రూ.1-50 పైసలు యూనిట్ కరెంటు అందిస్తామని చెప్పిన తరువాత చంద్రబాబు యూనిట్ రూ.2-00ల ప్రకటన చేశారు.

👉అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేసి, ఒక్క సంవత్సరానికి మాత్రమే యూనిట్ ధర రూ.2-00లు ప్రకటించడం చూస్తే, ఎన్నికలు ముగిసిన వెంటనే మరలా అధికంగా వడ్డించడానికి ప్రయత్నిస్తాడు.

👉తెలుగుదేశం నాయకులకు ఓట్లు తప్ప, ప్రజల సమస్యలు పట్టవు.

👉జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఆక్వాకు యూనిట్ ధర రూ.1-50 పైసల చొప్పున ఆక్వా రైతులను ఆదుకుంటాం.

admin