మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం సమీక్షించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని…

తేది.26-12-2018
నెల్లూరు జిల్లా, మనుబోలు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

👉 మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిట్టమూరు అనిత గారి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశంలో వివిధ శాఖల పని తీరును సమీక్షించిన సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉బండేపల్లి కాలువ కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఉన్న శ్రద్ధ, రైతాంగానికి సాగునీరు అందించడంపై లేకపోవడం శోచనీయం.

👉పది లక్షల రూపాయలకు మించిన ప్రతి పనికి టెండర్లు పిలావాలనే నిబంధన ఉన్నా, ఏకంగా 31 కోట్ల రూపాయలు పనిని నామినేషన్ పై అప్ప చెప్పి, ప్రజా ధనం దోచుకునేందుకు ప్రయత్నించారు.

👉2014 ఎన్నికల్లో బండేపల్లి కాలువ ద్వారా సాగునీరు అందించి,2019 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాము అని ప్రకటించినవారు, సాగునీరు అందించి ఓట్లు అడుగగలరా!.

👉బండేపల్లి కాలువ సాధించలేక, ఇతరులు కోర్టులకు వెళుతున్నారంటూ, ముందస్తు ప్రచారాలకు పూనుకోవడం చూస్తుంటే,ఎవరో ఒకరిని కోర్టుకు పంపి, పనులు జరుగకుండా, ప్రతిపక్షం పై నిందలు మోపడానికి ప్రయత్నిస్తున్నారు.

👉54 నెలలు పట్టించుకోని వారి హడావిడి చూస్తుంటే, కాంట్రాక్టు తాలూకు కమీషన్ల పై తప్ప, రైతాంగం పై శ్రద్ధ కనపడటం లేదు.

👉వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే బండేపల్లి కాలువ పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించి తీరుతాం.

👉బండేపల్లి కాలువ విషయం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రస్తావించిన వరకు అందరూ మరచిపోయారు.

👉అన్ని గ్రామాల రైతులకు సంబంధించిన భూసేకరణతో సహా, సమస్యలు అన్నింటిని పరిష్కరించి అన్ని అనుమానాలు నివృత్తి చేసి బండేపల్లి కాలువ నిర్మించి, తిరిగి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాము తప్ప, అవినీతి సంపాదనతో కాలం గడుపుతూ రైతుల సమస్యల పట్ల ఆలక్ష్యం ప్రదర్శించం.

👉రైతు రధం పేరిట ట్రాక్టర్ల కంపెనీల డీలర్లు, ప్రభుత్వం నిర్ధారించిన ధర కన్నా, దాదాపు ఒక లక్ష రూపాయలు తక్కువగా ట్రాక్టర్లు అందచేస్తున్నారు.

👉ప్రభుత్వ ధర కన్నా,మార్కెట్ ధర లక్ష రూపాయలు తక్కువయితే, ఆ లక్ష రూపాయల ప్రజాధనం ఎవరి జోబులోకి వెళుతోంది.

👉నీరు-చెట్టు పనుల కింద దోపీడీ తప్ప, రైతాంగానికి ఒరిగిందేమి లేదు.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకుని రైతులకు మొండిచేయి చూపిస్తున్నారు.

👉 రైతుల పేరు చెప్పి, దోపిడీకి పాల్పడే వారిని సమాజం క్షమించదు.

👉 పేదలకు తల దాచుకోవడానికి ఇళ్ళు మంజూరు చేయకుండా, అధికార పార్టీ నాయకుల పాత ఇళ్ళకు బిల్లులు చేసుకుంటున్నారు.

👉గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా, ఇష్టారాజ్యంగా తెలుగుదేశం నాయకులు జాబితా తయారు చేసి మండల అభివృద్ధి అధికారులను సంతకం పెట్టమని బెదిరిస్తున్నారు.

👉మండల అభివృద్ధి అధికారులను ఫోన్లలో బెదిరించి,బ్లాక్ మెయిల్ చేసి, సంతకాలు పెట్టించుకోవడం చూస్తుంటే ఎంత బరి తెగించారో అర్ధమవుతోంది.

👉నేను ప్రతిపక్షంలో ఉన్నా,అభివృద్ధిని గురించి తపన పడుతుంటే, అధికారంలో ఉన్న వారికి అవినీతికి పాల్పడుతూ, నన్ను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు.

👉శాసన సభ్యుడిగా నేను ఉన్నంత కాలం, ప్రజా ధనానికి కాపలాదారిగా వ్యవహరిస్తాను తప్ప, ఎవరు అవినీతికి పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదు.

admin