విశాఖట్నంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆఫీస్ లో అగ్రిగోల్డ్ బాధితుల బాసట సమావేశం:

JMRTVLIVE VISHAKHAPATNAM:
విశాఖట్నం వైఎస్ఆర్ సీపీపార్టీ కార్యాలయం:
అగ్రిగోల్డ్ బాధితుల బాసట సమావేశం:

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధితుల తరపున నిరంతరం పోరాటం చేస్తుందని వైఎస్ఆర్ సీపీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ అన్నారు. శనివారం నాడు విశాఖట్నంలోని మాజీ మంత్రి వర్యులు బోత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో విశాఖట్నంలోని పార్టీ ఆఫీస్ లో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన రాజాం నియోజకవర్గం అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ Uసురేష్ ముఖర్జీ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల కు బాసటగా నిలుస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ బయట పలుమార్లు డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుతో బాధితులు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు అని అన్నారు. తీవ్ర మనోవేదన తో బాధితులు 260 మంది చనిపోతే కేవలం 143 మందికి మాత్రమే ప్రభుత్వం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది అన్నారు. అగ్రిగోల్డ్ మోసంపై సిఐడి దర్యాప్తు ఏళ్ల తరబడి సాగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సురేష్ ముఖర్జీ అన్నారు.ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ గారు( మాజీ మంత్రి), లేళ్ల అప్పిరెడ్డి గారు (ఆంధ్ర ప్రదేశ్ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్), కురసాల కన్నబాబు గారు(కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యుక్షులు), గుడివాడ అమర్నాథ్ గారు(అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యుక్షులు), రాష్ట్ర ,జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

admin