వెంకన్నను దర్శించుకున్న కంబాల జోగులు ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు …

తిరుమల తిరుపతి,
చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్,
తే.11/01/2019ది.
Posted By VASU NAIDU Y

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాజాం నియోజకవర్గ శాసన సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కంబాల జోగులు గారు అభిలషించారు. శుక్రవారం తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శనం సమయం లో తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కంబాల జోగులు గారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో, శ్రీనివాసుని ఆశీస్సులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిందని, ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఆయురారోగ్యాలు, ఉన్నత పదవులు అలంకరించాలని ప్రార్థించినట్టు తెలిపారు. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారిలో కోలగట్ల వీరభద్రస్వామి (ఎమ్మెల్సీ), సాలూరు శాసన సభ్యులు పీడిక రాజన్నదొర, కురుపాం శాసనసభ్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీ వాణి, విజయనగరం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నాయకులు ఉన్నారు.

admin