వైఎస్‌ జగన్‌ తో కేటీఆర్‌ భేటీ….

JMRTVLIVE హైదరాబాద్‌:

Updated By Y.VASU NAIDU.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌, సంతోష్‌‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ కొద్దిసేపటి క్రితం వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ నేతలకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

ఈ భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేటీఆర్‌ బృందం వైఎస్‌ జగన్‌తో చర్చించనుంది. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుపై వైఎస్‌ జగన్‌ ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

ఇంటెల్జెన్స్ అడావిడి:- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు హడావుడి చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ నివాసానికి వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బృందం బుధవారం వైఎస్‌ జగన్‌తో సమావేశం కానున్న నేపథ్యంలోనే ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలను వారు ఎప్పటికప్పుడూ విజయవాడకు చేరవేస్తున్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు కోసం పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రతిపక్ష నేత ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచార సేకరణ కోసం ఇలా హడావుడి చేయడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.

admin