చంద్రబాబు.. అందుకే రాత్రికి రాత్రి సర్దుకొచ్చారా?

హైదరాబాద్‌ : ఎవరు బెదిరించడం వల్ల 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకొచ్చారని సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

‘టీడీపీ నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్లో చేరమని హైదరాబాద్‌లో బెదిరిస్తున్నారని నాయుడు బాబు కలవర పడుతున్నారు. మీకు ప్రపంచమంతా ఆస్తులున్నాయి. ఎవరైనా బెదిరించారా? 10 ఏళ్ల రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ.. మరీ అప్పుడెవరు వార్నింగిచ్చారో చెప్పండి.’ అని నిలదీశారు.

మరో ట్వీట్‌లో.. ‘వ్యవసాయం దండగ, రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నచంద్రబాబు పాలనలో రైతులకు భద్రత ఎక్కడుంటుంది. కొట్టి చంపినా, పండ్ల తోటలను ధ్వంసం చేసినా ప్రశ్నించకూడదట. కోటయ్యను హత్య చేసింది కాక కుటుంబ కలహాలతో చనిపోయాడని ఆయన మరణాన్ని అపహాస్యం చేస్తున్నారు.’ అని మండిపడ్డారు.

admin