మీడియా ముందుకు జ్యోతి హత్యకేసు నిందితులు…శ్రీనివాస్‌ పోలీసుల్నీ తప్పుదోవ పట్టించాడు!!!!

JMRTVLIVE గుంటూరు : రాష్ట్ర రాజధాని అమరావతిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌తో పాటు అతడికి సహకరించిన పవన్‌ కల్యాణ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులుశనివారం ఉదయం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను అర్బన్ ఎస్పీ విజయరావు వివరించారు. ‘జ్యోతికి శ్రీనివాస్‌కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకోమని అడిగినందుకే ప్రియురాలిని హతమార్చేందుకు పక్కా పథకం వేశాడు. గతంలో జ్యోతి దగ్గర శ్రీనివాస్‌ లక్ష రూపాయలు తీసుకున్నాడు. (వెలుగులోకి శ్రీనివాసరావు అకృత్యాలు)

జ్యోతిని హత్య చేసేందుకు శ్రీనివాస్‌ తన వద్ద క్లర్క్‌గా పనిచేస్తున్న పవన్ కల్యాణ్‌ సహకారం తీసుకున్నాడు. రాడ్‌తో తలపై కొట్టిన దెబ్బలకు షాక్‌తో జ్యోతి చనిపోయింది. సంఘటన జరిగిన రోజు శ్రీనివాస్‌ …జ్యోతికి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ చేశాడు. ఇద్దరి విజువల్స్‌ సీసీ టీవీ పుటేజ్‌లో లభించాయి. కేసును తప్పుదోవ పట్టించడానికి ఎన్నో ప్రణాళికలు వేసిన శ్రీనివాస్‌…. ఎవరో వచ్చి దాడి చేశారంటూ కట్టుకథలు చెప్పాడు. ఎవరికి అనుమానం రాకుండా పవన్‌తో ఇనుప రాడ్‌తో శ్రీనివాస్‌ దాడి చేయించుకున్నాడు. చీకట్లో బలంగా కొట్టడం వల్లే అతడికి పెద్ద దెబ్బ తగిలింది. శ్రీనివాస్‌ ఫేస్‌బుక్‌లోను అసభ్య చాటింగ్‌లు గుర్తించాం. చాలామంది మహిళలతో అతడు వీడియో చాట్ చేశాడు. శ్రీనివాస్‌పై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశాం. నిందితులు ఇద్దర్ని కోర్టులో ప్రవేశపెడుతున్నాం.’ అని ఎస్పీ తెలిపారు.

 

న్యూస్ పోస్ట్ వై వాసు నాయుడు.

admin