శివకుమార్ ఇష్యూ: జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు, ఏం జరిగిందంటే?

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకులు శివకుమార్ సస్పెన్షన్ విషయంలో ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంంధించి మార్చి 11వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ స్థాపించారు. ఆ తర్వాత ఈ పార్టీని జగన్‌కు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వైసీపీ మద్దతివ్వడాన్ని వ్యవస్థాపకులు అయిన శివకుమార్ వ్యతిరేకించారు. జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

సస్పెన్షన్‌పై ఈసీకి శివకుమార్ తనను వైయస్ జగన్..

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై శివకుమార్‌ను తీవ్రంగా స్పందించారు. అసలు సస్పెండ్‌ చేసే అధికారం జగన్‌కు లేదని, పార్టీ తనదేనని, వ్యవస్థాపక నియమ నిబంధనలను జగన్‌ పక్కన పెట్టారని శివకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీని తిరిగి తనకు స్వాధీన చేయాలని కోరారు. అందుకు అవసరమైన బలనిరూపణకు తాను సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసింది.

admin