నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.

తేది.23-02-2019
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.

తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న రావుల దశరథ రామయ్య గౌడ్, విరువూరు గ్రామ మాజీ సర్పంచ్ సురేష్ కుమార్ రెడ్డి(చిన్ని), మారుపూరు గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు గోపాల్ రెడ్డి తదితరులు.

భారీ బైక్ ర్యాలీతో, ఆనం, కాకాణి లకు స్వాగతం పలికిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ శ్రేణులు.

పొదలకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, వేలాది మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన వందలాది కుటుంబాలు.

ఆనం ప్రసంగం:

స్క్రోలింగ్ పాయింట్స్:

👉రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి పని చేశాం, ఆ అనుబంధ సంబంధంతోనే వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నాం.

👉వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లాకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం సంతృప్తిని కలిగించాయి.

👉రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

👉5 సార్లు శాసన సభ్యునిగా గెలిచా!, సుదీర్ఘ కాలం మంత్రిగా ఎన్నో పదవులు చేశా, రాజకీయాలు, పదవులు కొత్తవి కావు. వరుసగా ఓటమి పాలైన వారు మాట్లాడటం హాస్యాస్పదం.

👉మా కుటుంబంలో ఎప్పుడూ, ఇద్దరు శాసన సభ్యులుగా పనిచేయడం ఆనవాయితీ, వివేకన్న మన మధ్య లేకపోయినా సోదరులమైన నేను, గోవర్ధన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం.మా ఇద్దరిని శాసన సభ్యులుగా గెలిపిస్తారని ఆశీస్తున్నాం.

👉రాజశేఖర్ రెడ్డిగారి బిడ్డ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి రాజన్న పాలనను తిరిగి పొందుదాం.

👉తెలుగు దేశం పార్టీ నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన దశయ్య గౌడ్, సురేష్ కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డిని స్వాగతిస్తున్నాం.

కాకాణి ప్రసంగం:

స్క్రోలింగ్ పాయింట్స్:

👉సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగడం సంతోషం.

👉వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన వారిని, పార్టీలో ఎటువంటి పదవులు నిర్వహించని వారిని మహనాయకులంటూ కీర్తిస్తూ, తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని చంకలు గుద్దుకుంటున్నారు.

👉స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి గార్ల కృషి ఫలితమే కండలేరు ఎడమ కాలువ నిర్మాణం.

👉సుమారు 20వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పధకం, నాసిరకం మోటారు బిగించడంతో 2 వేల ఎకరాలకు నీరు అందించ లేకపోయింది.

👉సోమశిల దక్షిణ కాలువకు 5 సంవత్సరాలలో అక్విడెక్టు నిర్మించకుండా, దోపిడీకి అనుకూలంగా వుండే సైఫన్ నిర్మించి, అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.

👉బండేపల్లి కాలువ నిర్మాణం పేరిట, కాంట్రాక్టు టెండర్లు సోమిరెడ్డి తనకు అనుకూలమైన కాంట్రాక్టరుకు కట్టబెట్టి, కమిషన్లకు కక్కుర్తిపడుతుంటే, పోరాడి దాదాపు 4 కోట్ల మేర ప్రజాధనాన్ని కాపాడగలిగాం.

👉రైతుల పేరు చెప్పి దోపిడీకి పాల్పడిన వ్యక్తి, సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి తప్ప, మరొకరు లేరు.

👉పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతు రధం, నీరు-చెట్టు, ఎత్తిపోతల పధకం పేరిట భారీ అవినీతికి పాల్పడిన వ్యక్తి సోమిరెడ్డి.

👉సోమిరెడ్డి తాను కానీ, తన కుటుంబం కానీ, రాజకీయాలలోకి వచ్చి ప్రజలను అడ్డు పెట్టుకొని, అవినీతి సంపాదనకు పాల్పడకపోతే కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేయాలి.

👉సోమిరెడ్డి అవినీతి మీద కాణిపాకంలో ప్రమాణం చేయాలని నేను డిమాండ్ చేస్తే, సంబంధం లేని వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి, వాళ్ళని ప్రయాణానికి ఉసిగొల్పడం మంచి సంప్రదాయం కాదు.

👉సోమిరెడ్డి కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణానికి వెనకాడు తున్నాడంటే ఖచ్చితంగా అవినీతి పరుడేనని ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

👉 తాను చేసినట్లుగా, మేము చేయలేదని మాట్లాడుతున్న సోమిరెడ్డి, 40 సం||లు మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నా, సోమిరెడ్డి లాగా దోపిడీ చేయలేకపోయాం.

👉ప్రజలకు సేవ చేశాం తప్ప,40 ఏళ్లలో సోమిరెడ్డిలాగా ప్రజా సొమ్మును దోచుకోలేదు.

👉మనుబోలు మండలంలో సోమిరెడ్డి తనకు 6వేల మెజారిటీ వస్తుందని భీకరాలు పలుకుతున్నాడు. సాధారణ ఎన్నికల ముందే మనుబోలు మండలం వరకు ఎన్నికలు నిర్వహించుకుందాం,ఒక్క ఓటు సోమిరెడ్డికి మెజారిటీ వచ్చిన 2019 ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయను.

👉ఆనం కుటుంబంతో, మా కుటుంబం అనేక సంవత్సరాలు గా కలిసి, మెలిసి పనిచేసినా మా రెండు కుటుంబాలు అవినీతిని దరిచేరనీయలేదు.

👉సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి అని కాదు, మీ ఇంటి బిడ్డ, మీ కుటుంబ సభ్యుడు, మీ తోబుట్టువుగానే భావించండి.

👉గత ఎన్నికల్లో చందాలు వసూళ్ళు చేసుకున్నవారు, రాబోవు ఎన్నికల్లో ఓటుకు 5 వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

👉మన దగ్గర దోచుకున్న అవినీతి సొమ్ము ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకొని, ఆత్మ ప్రబోదం మేరకు ఓటు వేయండి.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి పాత, కొత్త నాయకులందరూ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి రావడం నా అదృష్టం.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రామనారాయణ న్న కృషి అమోఘం.

👉రామనారాయణన్న కృషికి ఫలితంగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి, జగనన్నకు కానుకగా అందిద్దాం.

👉పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయకపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కార్యకర్తలందరినీ నా కంటికి రెప్పలా కాపాడుకుంటా.
Posted By Vasu Naidu.

admin